Aishwarya Rai Bachchan: మరోసారి తెరపైకి అభిషేక్, ఐశ్వర్య విడాకుల టాక్.. ఈసారి ఇలా
అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ మధ్య సంబంధం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. అభిషేక్-ఐశ్వర్య విడాకుల గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐశ్వర్య, అభిషేక్ గత కొన్ని రోజులుగా కలిసి కనిపించడం లేదు. ఇటీవల ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు జరిగింది. అప్పుడు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు.
సెలబ్రిటీ జంటలుప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం ఆతర్వాత విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇలా విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. ఈ మధ్యనే కొందరు తమ విడాకుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు కూడా.. ఇక ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పై కూడా విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ మధ్య సంబంధం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. అభిషేక్-ఐశ్వర్య విడాకుల గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐశ్వర్య, అభిషేక్ గత కొన్ని రోజులుగా కలిసి కనిపించడం లేదు. ఇటీవల ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు జరిగింది. అప్పుడు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిషేక్ గూగుల్‌లో ఐశ్వర్య ఫోటో కోసం సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసి పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య విడాకుల గురించి వార్తలకు బలం చేకూరింది. ఇంతలో ఓ పాత ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది.
2010లో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘అభిషేక్, నేనూ రోజూ గొడవపడుతున్నాం..’ అని చెప్పింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ అసమ్మతి త్వరలో పరిష్కరించబడుతుంది. మా సంబంధంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. అవి లేకుండా జీవితం పూర్తిగా బోరింగ్‌గా ఉంటుంది. మా విభేదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాం.’అని చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు విడాకుల దాకా వెళ్లాయని అంటున్నారు.
ఇక సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తాజాగా ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఐశ్వర్య-అభిషేక్ విడాకుల గురించి రాసుకొచ్చాడు. ‘అభిషేక్-ఐశ్వర్య అధికారికంగా విడాకులు తీసుకున్నారని’ ఉమైర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను పోస్ట్ చేసే దాదాపు అన్ని ట్వీట్లు ఫేక్. అందుకే ఆయన చేసిన ట్వీట్‌ని జనం సీరియస్‌గా తీసుకోలేదు. నటుడు సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత ఐశ్వర్యరాయ్ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అభిషేక్‌తో ప్రేమలో పడింది. 2007లో ఐశ్వర్య-అభిషేక్ కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్య 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చింది. ఇప్పుడు వీరిద్దరి విడాకులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది నిజం కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో చూడాలి.
View this post on Instagram
No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..
NO FAKE NO BOT JUST ORIGINAL
డిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.