Fighter: పెద్ద ప్లానే.. 3డి వెర్షన్‌లో రానున్న హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ..
హృతిక్ రోషన్ నటించిన వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. తాజాగా ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే 'ఫైటర్' సినిమా 3డి (ఐమాక్స్ 3డి) వెర్షన్‌లో కూడా విడుదల కానుంది .
2024లో విడుదల కానున్న సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘ ఫైటర్ ‘ మూవీ ఒకటి. హృతిక్ రోషన్ నటించిన వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. తాజాగా ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే ‘ఫైటర్’ సినిమా 3డి (ఐమాక్స్ 3డి) వెర్షన్‌లో కూడా విడుదల కానుంది .
బాలీవుడ్ సినిమాల పరిధి చాలా ఎక్కువ. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ , ‘పఠాన్’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత, ఇతర హీరోలకు కొత్త టార్గెట్ ఏర్పడింది. దాంతో అందరు హీరోలు భారీ బడ్జెట్ సినిమాల పై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఫైటర్ కూడా అలానే తెరకెక్కింది. మరి ‘ఫైటర్’ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందో లేదో వేచి చూడాలి. ‘యానిమల్’ సినిమా సక్సెస్ కెరటంలో మునిగి తేలుతున్న అనిల్ కపూర్ ‘ఫైటర్’ సినిమాలో కూడా నటిస్తున్నారు.
‘ఫైటర్’ సినిమా 2డి, 3డి, ఐమాక్స్ 3డి వెర్షన్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. దీన్ని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి కాబట్టి, ‘ఫైటర్’ ఐమాక్స్ 3డి వెర్షన్‌లో విడుదల కానుంది.
‘ఫైటర్’ సినిమా జనవరి 25, 2024న విడుదల కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పలు భాషల్లో పలు స్టార్ల సినిమాలు విడుదలవుతాయి. కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది. ‘ఫైటర్’ 3డిలో విడుదలైతే, హృతిక్ సినిమా 3డిలో విడుదల కావడం ఇదే తొలిసారి. దీపికా పదుకొణె నటించిన ‘పద్మావత్’ 3డి వెర్షన్‌లో విడుదలై విజయం సాధించింది.
View this post on Instagram
No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..
NO FAKE NO BOT JUST ORIGINAL
డిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.