AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా ,అనుకున్న సమయానికే వస్తుంది.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా ,అనుకున్న సమయానికే వస్తుంది.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 29, 2021 | 8:32 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు.

హరహర వీరమల్లు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. అలాగే విడుదల తేదీలను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ కూడా సంక్రాంతికి రాకపోవచ్చనే  వార్త చక్కర్లు కొట్టింది. ఈ విషయంపై నిర్మాత ఎ.ఎమ్.రత్నం స్పందిస్తూ .. ” క్రిష్ తాను అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగు పూర్తి చేసే దర్శకుడు. పైగా  సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది .. అందువలన ‘హరిహర వీరమల్లు’ విడుదలను వాయిదా వేసే పరిస్థితి రాదు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది ” అని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

విజయ్ దేవరకొండ గురించి ఓపెన్ అయిన రష్మికామందాన్న..! ఏం చెప్పిందో తెలిస్తే ఫ్యాన్స్‌కి పండగే..

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

15 Years For Pokiri Movie: ట్రెండ్ సెట్టర్.. పోకిరి సంచలనానికి 15 ఏళ్లు.. ఇప్పుడు.. ఎప్పుడూ మైండ్ బ్లాకే…