AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దేవరకొండ గురించి ఓపెన్ అయిన రష్మికామందాన్న..! ఏం చెప్పిందో తెలిస్తే ఫ్యాన్స్‌కి పండగే..

Rashmika Coments : రష్మిక మందాన్న, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఏదో ఉందని

విజయ్ దేవరకొండ గురించి ఓపెన్ అయిన రష్మికామందాన్న..! ఏం చెప్పిందో తెలిస్తే ఫ్యాన్స్‌కి పండగే..
Rashmika Coments
uppula Raju
|

Updated on: Apr 28, 2021 | 11:38 PM

Share

Rashmika Coments : రష్మిక మందాన్న, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాలతో ఈ జంట ఓ ఊపు ఊపింది. ఇద్దరూ పాన్-ఇండియా స్టార్స్‌గా మారారు. విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం లైగర్‌‌తో బిజీగా ఉండగా.. రష్మికా మందాన్న మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. అంతేకాకుండా సుకుమార్, అల్లు అర్జున్‌లతో కలిసి పుష్పాలో పనిచేస్తోంది. బాలీవుడ్‌లో మిషన్ మంగల్‌ సినిమాలో కనిపించనుంది.

ఇటీవల ఈ భామ తన తన బాలీవుడ్, పాన్-ఇండియా ప్రాజెక్టుల గురించి ఫ్యాన్స్‌కి తెలియజేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్ ప్రోగ్రాం నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తాను ప్రస్తుతం 2 బాలీవుడ్ సినిమాలు చేస్తున్నానని, త్వరలో మూడో చిత్రానికి సంతకం చేస్తాన్నట్లుగా తెలిపింది. ఇంతలో ఓ అభిమాని మీ బాయ్‌ఫ్రెండ్ ఎవరు..? విజయ్ దేవరకొండతో మళ్లీ ఎప్పుడు సినిమా ఉంటుందని సూటిగా అడిగాడు..

దానికి రష్మిక మందాన్న ఇలా సమాధానమిచ్చింది. మీరు ఈ ప్రశ్న అతడిని లేదా మా ఇద్దరికి సరిపోయే స్క్రిప్ట్ ఉన్న దర్శకుడిని అడగాలని బదులిచ్చింది. మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా విజయ్ దేవరకొండతో కలిసి పని చేస్తానని చెప్పింది. అతనితో డేట్ చేసారా అడిగిన ప్రశ్నకు “నాకు డేట్ ఎలా వెళ్ళాలో తెలియదు.. సాహసోపేత క్రీడలు ఆడటానికి మాత్రం ఇష్టపడతానని చెప్పింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తాను దాదాపు నాలుగు ఐదు నెలలు తన కుటుంబాన్ని చూడలేదని వెల్లడించింది. ప్రస్తుతం రష్మిక హైదరాబాద్ లో పుష్ప చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది.

APPSC Group 1 Mains Result: ఏపీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలు విడుదల

దేశంలో కోవిడ్ సంక్షోభం, సాయానికి రష్యా సిధ్దం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు