AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Film Awards: జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులు వరించిన తెలుగు చిత్రాలు ఎన్నంటే..

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం అట్టహసంగా జరిగింది. సినీ పరిశ్రమలో

National Film Awards: జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులు వరించిన తెలుగు చిత్రాలు ఎన్నంటే..
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2021 | 1:54 PM

Share

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం అట్టహసంగా జరిగింది. సినీ పరిశ్రమలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులతోపాటు.. ప్రేక్షకులు ఆదరించిన సినిమాలకు అవార్డులు అందచేశారు.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నటీనటులు అవార్డులు అందుకున్నారు.

111

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‏లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు నటీనటులు హజరయ్యారు.. అలాగే నటనలో.. దర్శకత్వంలో…నిర్మాణ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ అత్యంత విశిష్టమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.

222

ఇక మణికర్ణిక చిత్రానికి గానూ కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఫీచర్ ఫిల్మ్ గా మలయాళం నుంచి మరక్కర్ సినిమా నిలవగా.. భోంస్లే చిత్రానికి మనోజ్ పాయ్.. అసురన్ చిత్రానికి ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు.

333

ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ సినిమా నిలిచింది. ఎడిటింగ్ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు పాపులర్ ఫిల్మ్‏గా మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్‏గా రాజు సందరం మాస్టర్ జాతీయ అవార్డు అందుకున్నారు. మొత్తంగా తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా.. మహర్షి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి.

444

555

విన్నర్స్.. ☛ ఉత్తమ చిత్రం – మరక్కర్ (మలయాళం) ☛ఉత్తమ నటుడు – మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌) ☛ ఉత్తమ నటి – కంగనా రనౌత్‌ (మణికర్ణిక) ☛ ఉత్తమ తెలుగు చిత్రం – జెర్సీ ☛ ఉత్తమ ఎడిటింగ్‌ – నవీన్‌ నూలి (జెర్సీ) ☛ ఉత్తమ దర్శకుడు – సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌) ☛ ఉత్తమ వినోదాత్మక చిత్రం – మహర్షి ☛ ఉత్తమ హిందీ చిత్రం – చిచ్చోరే ☛ ఉత్తమ సహాయ నటి – పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌) ☛ ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ – అవనే శ్రీమన్నారాయణ(కన్నడ) ☛ ఉత్తమ సహాయ నటుడు – విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌) ☛ ఉత్తమ తమిళ చిత్రం – అసురన్‌ ☛ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌ – మరక్కర్‌ (మలయాళం) ☛ ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – డి.ఇమ్మాన్‌ (విశ్వాసం) ☛ ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య) – ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో) ☛ ఉత్తమ గాయకుడు – బ్రి.ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’) ☛ ఉత్తమ మేకప్‌ – రంజిత్‌ (హెలెన్‌) ☛ ఉత్తమ గాయని – శావని రవీంద్ర (బర్దో-మరాఠీ) ☛ ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – రాజు సుందరం (మహర్షి)

ALSO READ: National Film Awards: ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్…

Samantha: నయనతార.. విఘ్నేశ్ శివన్‏లకు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. కారణమేంటంటే..