Chiranjeevi-Pawan Kalyan: వివాహవేడుకలో సందడి చేసిన అన్నదమ్ములు చిరు పవన్‌లు
Mega Brothers Chiru-Pawan: మెగా ఫ్యాన్స్ కు కనువిందు చేస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై సందడి..

Mega Brothers Chiru-Pawan: మెగా ఫ్యాన్స్ కు కనువిందు చేస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తనయుడి వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరగింది. ఈ వేడుకకు అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలయికకు వేదికయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ప్రేమగా కౌగిలించుకుని ఫోటోలు ఫోజులు ఇచ్చారు. వీటిని మెగా, పవన్ అభిమానులు షేర్ చేస్తూ.. తెగ సంబర పడుతున్నారు. చిరంజీవి పుట్టిన రోజున పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇంటికి వెళ్లడం తెలిసిందే.. అనంతరం.. మళ్ళీ ఇప్పుడే అన్నదమ్ములిద్దరూ కలిసి బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రస్తుతం మెగా అన్నదమ్ములిద్దరూ వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.
Ustaad @PawanKalyan & Boss @KChirutweets At Wedding Event ?? pic.twitter.com/SSyKdrDZeO
— Sannidhi Brothers ? (@SannidhiBrother) October 25, 2021
Also Read: తండ్రి సినిమాలో కొణిదెలవారి వారసుడు..అకిరా టాలీవుడ్ ఎంట్రీపై ఊహాగానాలు..