Pawan Kalyan-Akira: తండ్రి సినిమాలో కొణిదెలవారి వారసుడు..అకిరా టాలీవుడ్‌ ఎంట్రీపై ఊహాగానాలు..

Pawan Kalyan-Akira: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి అడుగు...

Pawan Kalyan-Akira: తండ్రి సినిమాలో కొణిదెలవారి వారసుడు..అకిరా టాలీవుడ్‌ ఎంట్రీపై ఊహాగానాలు..
Pawan Akira
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2021 | 1:05 PM

Pawan Kalyan-Akira: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాల్లో గ్యాప్ తీసుకుని ఇటీవలే వకీల్ సాబ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వరస సినిమాలతో ఫుల్ బిజిబిజిగా ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు.. సెంటరాఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తాడు. ఇంకా చెపపాలంటే.. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. 2004 లో పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ లకు జన్మించిన ఈ టీనేజర్ ను చూసి అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అని మురిసిపోతుంటారు. హైట్ విషయంలో తాత పోలిక వచ్చి అకిరా.. ఇప్పటికే 6+ తో హీరోని తలపిస్తున్నాడు. పదిహేడేళ్లకే అకిరా.. అన్న వరుణ్ తేజ్ పొడవుకు పోటీ వచ్చేస్తున్నాడు. ఫ్యామిలీ అందరికంటే పొడవు అనిపిస్తూ.. తాను కూడా నెక్స్ట్ హీరోగా ఎంట్రీకి రెడీ అని చెప్పకనే చెప్పేస్తున్నాడు పవన్ తనయుడు. ఇక అభిమానులు మెగావారసుడు అకిరా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు అకిరా తండ్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఓ పాత్రలో నటించనున్నాడు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న “హరిహర వీరమల్లు” సినిమా లో అకిరా సందడి చేయనున్నాడనే పుకారు షికారు చేస్తోంది. హరిహర వీరమల్లు.. మొగలుల సామ్రాజ్యం కాలం నేపధ్య కథ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ఈ సినిమాలో గుర్రపు స్వారీ లు.. కత్తి యుద్ధాలు..  మొఘల్ కాలం నాటి .. యుద్ధ విద్యలు  ఉంటాయట.. ఇక ఈ సినిమాలో అకిరా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడట. తన పాత్ర కోసం అకిరా కర్రసాము నేర్చుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్త హల్ చల్ చేస్తోంది.  అకిరా నటించేది ఓ చిన్న పాత్ర.. అయినప్పటికీ పవన్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.

అకీరా తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు తెచ్చుకునేలా వున్నాడని సన్నిహితుల మాట.  అకిరా తండ్రి పవన్ లా.. మరోపక్క కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది పూణేలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి పవన్ బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకిరా.. ప్రస్తుతం తనకంటే పెద్దవారికి కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్ , ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!