Samantha: నయనతార.. విఘ్నేశ్ శివన్‏లకు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. కారణమేంటంటే..

లేడీ సూపర్ స్టార్ నయనతార... ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‏లకు సమంత శుభాకాంక్షలు తెలిపింది. అగ్ర కథానాయికగా ఓ వైపు వరుస

Samantha: నయనతార.. విఘ్నేశ్ శివన్‏లకు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. కారణమేంటంటే..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 25, 2021 | 10:59 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార… ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‏లకు సమంత శుభాకాంక్షలు తెలిపింది. అగ్ర కథానాయికగా ఓ వైపు వరుస సినిమాలు చేస్తునే మరోవైపు నిర్మాతగా వ్యవహరించి… కాబోయే భర్త.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‏తో కలిసి నయన్.. కూళాంగల్ అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా 2022 సంవత్సరానికిగానూ.. ప్రదానం చేయనున్న 94వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరుపున ఎంపికైంది. నయన్ నిర్మాతగా మారి తనకు కాబోయే భర్తతో కలిసి నిర్మించిన కూళాంగల్ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో సమంత వారిద్దరికి తన ఇన్‏స్టా ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాను తన కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఫీల్మ్ మేకర్ పిఎస్ వినోథ్ రాజ్ తెరకెక్కించారు..

ఇన్‏స్టా పోస్ట్..

Samantha 1

అంతర్జాతీయంగా గులకరాళ్లుగా పిలువబడే కూళాంగల్ సినిమా వాస్తవ సంఘటనలకు రూపం. మద్యానికి బానిసైన తండ్రి… అతని కుమారుడికి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు.. వారి జీవన సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం పట్ల విఘ్నేశ్ శివన్ ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరుపున 14 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. అందులో నయట్టు. మండేలా, షెర్నీ, సర్ధార్ ఉదమ్ ఉన్నాయి. ఇప్పటి వరకు భారతీయ సినిమాలు ఆస్కార్ అవార్డు గెలుచుకోలేదు. 2001లో అశుతోష్ గోవారికర్ తెరెక్కించిన అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో చివరి ఐదు స్థానాల్లోకి చేరిన చివరి భారతీయ సినిమా. మొదటి ఐదు స్థానాల్లో రెండు భారతీయ సినిమాలు నిలిచాయి. అవి మదర్ ఇండియా (1958), సలాబ్ బాంబే (1989), ఇక ఆ తర్వాత మలయాళం సినిమా జల్లికట్టు..

Also Read: Rajini Kanth: ఈరోజు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజినీకాంత్.. అయినా తలైవా మనసులో బాధే ఎందుకో..

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..