Khiladi Movie: రవితేజ ఖిలాడి నుంచి మూడో సాంగ్.. మరోసారి అదరగొట్టిన దేవీశ్రీ..
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజాగా చిత్రం ఖిలాడి. రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు
Khiladi Movie: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజాగా చిత్రం ఖిలాడి. రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా కాలంగా హిట్ లేక సతమతం అయిన రవితేజ ఎట్టకేలకు క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ క్రమంలోనే ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ క్లామక్స్ కు వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు.. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకుల్లో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో పాటను విడుదల చేశారు. అట్ఠసుడకే అనే ఫుల్ జోష్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను దేవీశ్రీ ప్రసాద్ ఆలపించారు. కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్.. సచిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి కనిపించనున్నారు. అలాగే రావు రమేశ్ .. ఉన్ని ముకుందన్ .. మురళీ శర్మ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :