AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life of Ram: సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ లైఫ్ ఆఫ్ రామ్ పాట..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్  స్థానం ఉంది. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు శర్వా. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా చేస్తున్నాడు శర్వా.

Life of Ram: సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ లైఫ్ ఆఫ్ రామ్ పాట..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 29, 2021 | 9:29 AM

Share

Life of Ram: టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్  స్థానం ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు శర్వా. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా చేస్తున్నాడు శర్వా. ప్రస్తుతం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మరో హీరోగా సిద్ధర్థ్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుత షూటింగ్ దశలో ఉంది. ఇదే క్రమంలో కిశోర్ తిరుమల తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 సినిమాను తెలుగు జాను అనే టైటిల్ తో రీమేక్  తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్, సమంత జంటగా నటించారు. ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. కానీ ఈ సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాట మాత్రం శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ ను క్రియేట్ చేసింది.

‘ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా..’ అంటూ సాగిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సింగర్ ప్రదీప్ కుమార్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడు. ఇక ఈ సినిమాకు గోవింద్ వసంత్ సంగీతాన్ని అందించారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జాను’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా..శర్వా  కాస్త వయసు మీద పడిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రామచంద్ర పాత్రలో నటించాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

విజయ్ దేవరకొండ గురించి ఓపెన్ అయిన రష్మికామందాన్న..! ఏం చెప్పిందో తెలిస్తే ఫ్యాన్స్‌కి పండగే..

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..