Dil Raju: రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన దిల్‌రాజు.. పాలిటిక్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ వ్యాఖ్యలు..
దిల్‌రాజు.. సగటు తెలుగు ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల తమిళంతో పాటు హిందీలోనూ పేరు సంపాదించుకుంటున్నారు. టాలీవుడ్‌లో సక్సస్‌ఫుల్ నిర్మాతల్లో టాప్ లిస్ట్‌లో ఉంటారు దిల్‌రాజు. స్టోరీ సెలక్షన్స్‌లో తనదైన వైవిద్యాన్ని చూపుతూ...
దిల్‌రాజు.. సగటు తెలుగు ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల తమిళంతో పాటు హిందీలోనూ పేరు సంపాదించుకుంటున్నారు. టాలీవుడ్‌లో సక్సస్‌ఫుల్ నిర్మాతల్లో టాప్ లిస్ట్‌లో ఉంటారు దిల్‌రాజు. స్టోరీ సెలక్షన్స్‌లో తనదైన వైవిద్యాన్ని చూపుతూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తాజాగా బలగం వంటి చిన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకొని మరోసారి తన టేస్ట్ ఎలాంటిదో చాటి చెప్పారు.
బలగం సినిమా విజయంలపై దర్శకుడు వేణుకు ఎంతటి అభినందనలు వస్తున్నాయో.. నిర్మాత దిల్ రాజుకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో ముచ్చటించిన దిల్‌రాజు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది ఆహ్వానిస్తున్నారు. అయితే రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను’ అని చెప్పుకొచ్చారు. అయితే దిల్‌రాజు ఎక్కడా తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పకపోవడం కొసమెరుపు.
నేను అడ్డుకోవడం లేదు..
ఇదిలా ఉంటే బలగం సినిమాను ఇటీవల గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. గ్రామస్తులంతా ఓ చోట చేరి బలగం మూవీని వీక్షిస్తున్నారు. ఓటీటీలో విడుదలైన సినిమాను ఇలా బహిరంగంగా వీక్షించడం చట్ట విరుద్దమని దీనిపై దిల్‌రాజు పోలీసులను సంప్రదించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలపై కూడా దిల్‌రాజు స్పందించారు. గ్రామాల్లో మా “బలగం ” సినిమా ప్రదర్శనను నేను అడ్డుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రేక్షకులకు చేరువకావడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. మా బలగం సినిమా చూసి ప్రేక్షకుల్లో మనస్పర్థలు తొలిగిపోయి కలుసుకుంటున్నారు. అంతకంటే అదృష్టం ఏమి ఉంటుందని దిల్‌రాజు పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..