Telugu indian idol: ఇండియన్ ఐడల్ వేదికపై నాని హంగామా.. 16 ఏళ్ల సింగర్‌కి ఛాన్స్ ఇచ్చిన నేచురల్ స్టార్..
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోన్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఔత్సాహిక సింగర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ దూసుకుపోతోందీ షో. ఇక తాజాగా ఈ షోకి నేచురల్ స్టార్ నాని ప్రత్యే అతిథిగా హాజరయ్యారు. దసరా మూవీతో బ్లాక్ బ్లసర్ అందుకున్న..
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోన్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఔత్సాహిక సింగర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ దూసుకుపోతోందీ షో. ఇక తాజాగా ఈ షోకి నేచురల్ స్టార్ నాని ప్రత్యే అతిథిగా హాజరయ్యారు. దసరా మూవీతో బ్లాక్ బ్లసర్ అందుకున్న నాని తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద ఈ వారం స్పెషల్ గెస్ట్‌గా మెరవనున్నారు.
దసరా సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నారు నాని. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్స్ సీజన్‌కే హైలెట్‌గా నిలవనుంది. టాప్ 10 కంటెస్టంట్లు ఈ ఎపిసోడ్స్‌లో మధురగాయకుడు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎప్పీ చరణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు.
ఫిదా అయిన నాని..
హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. 16 ఏళ్ల కుర్రాడికి నాని సినిమాలో పనిచేసే అవకాశం రావడం విశేషం. మరెందుకు ఆలస్యం ఇప్పటి వరకు ఆహా సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారు వెంటనే సబ్‌స్బ్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 7,8 తేదీల్లో ప్రసారమయ్యే ప్రత్యేక ఎపిసోడ్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ మజాను పొందండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..