చాలా మంది నేను చనిపోయానని అనుకుంటున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన ఎల్.బి.శ్రీరామ్
సుమారు 400 కు పైగా సినిమాల్లో తన నటనతో ఆడియెన్స్ ను అలరించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆడియెన్స్ తో కన్నీళ్లు కూడా పెట్టించగలడు ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలిగే ప్రతిభ ఈ నటుడిలో సొంతం. అందుకే నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

రచయితగా, నటుడిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు ఎల్.బి.శ్రీరామ్. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు ఎల్.బి.శ్రీరామ్. తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను రంజింప చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఎల్.బి.శ్రీరామ్ పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించారు. కాగా మొన్నామధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎల్.బి.శ్రీరామ్ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. చాలా మంది తనను మర్చిపోతున్నారని.. ఇప్పుడు కనిపించని నటులను చనిపోయారు అని చాలా మంది అనుకుంటున్నారని.. ఎల్.బి.శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకమంది నటులను, ముఖ్యంగా స్రవంతి సినిమాల్లో కనిపించని వారిని, సోషల్ మీడియాలో చనిపోయారనుకొని రిప్ అంటూ తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారని ఎల్.బి.శ్రీరామ్ అన్నారు.
అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ
నేను ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు.. నేను బతికే ఉన్నానని ఎవరికి తెలుస్తుంది.? ఎలా తెలుస్తుంది.? నిజంగానే లేడేమోరా.. ఉంటే సినిమాలో వచ్చేవాడు కదా.. అనుకునే అవకాశం ఉంది కదా.? అని అన్నారు ఎల్.బి.శ్రీరామ్. కోట్లమంది ప్రేక్షకులకు చేరువయ్యే సినిమా కంటే, తన తృప్తి కోసం చేస్తున్న షార్ట్ ఫిల్మ్‌లు ఐదు, ఆరు లక్షల మందికి చేరువవుతాయని, ఈ జనరేషన్‌కు తన ఉనికి తెలియాలంటే షార్ట్ ఫిలిమ్స్ చేయాలని అనుకున్నా.. జనాలు కూడా కనిపించని వారి గురించి ఎందుకు పట్టించుకుంటారు..?, లేనివారి గురించి ఎందుకు ఎంక్వైరీ చేయాలి.? అని అనుకుంటారని ఎల్.బి.శ్రీరామ్ అన్నారు. ఈ విషయంలో ఎవరినీ నిందించడం లేదని, తాను ఎవరి మీద ఫిర్యాదు చేయలేనని స్పష్టం చేశారు.
ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య
కళాకారుడిగా తాను ఒకే రకమైన పాత్రలకే పరిమితం కావడానికి ఇష్టపడనని శ్రీరామ్ పేర్కొన్నారు. ఒకరైకమైన యాసతో మాట్లాడి నవ్వించా.. కొన్నాళ్ల తర్వాత అవే తరహా పాత్రలు ఎక్కువ వచ్చాయి.. అది తనకు విసుగు తెచ్చిందని ఆయన అన్నారు. డబ్బు సంపాదనకు అవకాశం ఉన్నా, కళాత్మక సంతృప్తి లేకపోతే ఒక క్షణం కూడా అక్కడ ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. ‘నేను ఆర్టిస్ట్ ని. అన్నీ చేయగలగాలి. ఒక్కదానికే ఫిక్స్ అయిపోకూడదు. బాగుంది.. రూపాయలు వస్తున్నాయి కదా.. హాయిగా ఉంది అనుకోకూడదు. అప్పుడు నేను డబ్బు మనిషినో, ఏదో లెక్కల మనిషినో అవుతాను తప్ప కళాకారుడిని కాను’ అని అన్నారు ఎల్.బి.శ్రీరామ్.
అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




