ప్రముఖ కమెడియన్‌కు క్యాన్సర్.. ‘ఆ డాక్టర్ తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల.. ‘

తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించే ప్రముఖ కమెడియన్‌ అతుల్ (56) తన ఆరోగ్యం గురించి షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఆయన లివర్‌ క్యాన్సర్‌తో బాధపుడుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా..

ప్రముఖ కమెడియన్‌కు క్యాన్సర్.. 'ఆ డాక్టర్ తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల.. '
Atul Parchure
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2023 | 9:18 AM

తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించే ప్రముఖ కమెడియన్‌ అతుల్ (56) తన ఆరోగ్యం గురించి షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఆయన లివర్‌ క్యాన్సర్‌తో బాధపుడుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ‘ది కపిల్ శర్మ షో’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతుల్ పర్చురే అనతి కాలంలోనే పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు వివాహం జరిగి 25 ఏళ్లు అయ్యింది. మేము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను. కానీ కొన్ని రోజులుగా తినడంలో నాకు కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ఏదో తప్పుగా జరుగుతుందని గ్రహించాను. ఆరోగ్యం మరింత క్షీణించడంతో నా సోదరుడు మెడిసిన్‌ తెచ్చి ఇచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆసుపత్రికి వెళ్లగా నాకు అల్ట్రాసోనోగ్రఫీ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు’.

‘నా లివర్‌లో 5 సెంటీమీటర్ల కణితి ఉందని, అది క్యాన్సర్ అని తెలిసింది. కానీ చికిత్స నాపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. వ్యాధి సరైన సమయంలో కనుగొన్నప్పటికీ తప్పుడు ట్రీట్మెంట్‌ ఇవ్వడం వల్ల నా ప్యాంక్రియాస్ ప్రభావితమైంది. సరైన వైద్యం అందకపోవడంతో నా పరిస్థితి మరింత దిగజారింది. సరిగ్గా మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాను. మాట్లాడేటప్పుడు నాలుక తడబడేది. ఆ తర్వాత వేరే డాక్టర్‌ వద్ద ట్రీట్‌మెంట్ తీసుకోవడం ప్రారంభించానని’ చెప్పుకొచ్చారు.

కాగా అతుల్ ప్రముఖ మరాఠీ నటుడు. ది కపిల్ శర్మ షోలో సుమోనా తండ్రి పాత్రలో నటించాడు. అతుల్‌ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు. ఈ షోతోపాటు ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’, ‘ఆర్.కె.లక్ష్మణ్ కి దునియా’, ‘జాగో మోహన్ ప్యారే’, ‘భాగో మోహన్ ప్యారే’ వంటి పలు షోలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.