Andhra Weather: ఏపీకు మళ్లీ వర్షసూచన.. సరిగ్గా సంక్రాంతికి వానలు
రెండు మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని వెల్లడించింది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా వర్ష సూచన చేసింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...
ఏపీకు మళ్లీ వర్షసూచన.. సరిగ్గా సంక్రాంతికి వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం చెబుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని చెబుతున్నారు. ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో మాత్రం మరో రెండ్రోజులు పొడి వాతావరణం ఉండనుంది. ఉపరితల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే, ఏపీలో చాలా చోట్ల మరో మూడు, నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో సైతం వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
అలాగే తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఇక రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి