Sankranti: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌

Hyderabad Vijayawada Highway: పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం వాసులంతా పల్లెబాట పట్టింది. ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు శని, ఆదివారాలు కావడంతో ప్రజలంతా సొంతూర్లకు వెళ్తేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో హైదరాబాద్‌ అంతటా ట్రాఫిక్‌ స్లోగా కదులుతోంది. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులతోపాటు నేషనల్‌ హైవేస్‌ అన్నీ ఫుల్ రష్‌తో కిటకిటలాడుతున్నాయ్‌.

Sankranti: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌
Hyderabad Vijayawada Highwa
Follow us
Venkata Chari

|

Updated on: Jan 11, 2025 | 9:33 AM

Hyderabad Vijayawada Highway: ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షల మంది జనం.. సొంతూర్లకు క్యూకట్టారు. దాంతో, హైదరాబాద్‌ రోడ్లు స్తంభించిపోయాయ్‌. నగరం నలుమూలలా ఎటుచూసినా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయ్‌.

మెయిన్‌గా, హైదరాబాద్‌ విజయవాడ హైవేపై పుల్‌ రష్‌ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో, ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది.

హైదరాబాద్‌-విజయవాడ హైవే.. హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో.. ట్రాఫిక్‌ వెరీవెరీ స్లోగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదారులపైనా భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌, విజయవాడ హైవేపై పుల్‌ రష్‌ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాల రద్దీ నివారించేందుకు పోలీసులు, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది.

రహదారులే కాదు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు రద్దీగా మారాయి. సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయ్‌.

మరోవైపు, సంక్రాంతి రద్దీని క్యాష్‌ చేసుకుంటున్నాయ్‌ ప్రైవేట్ ట్రావెల్స్. డబుల్ ట్రిఫుల్‌ ఛార్జీలు వసూలుచేస్తూ ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తాయి. వెయ్యి రూపాయలు ఉండే టికెట్‌ ధర రెండింతలు మూడింతలు పెంచేసి వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లాలంటే సాధారణంగా వెయ్యి లోపే ఖర్చు అవుతోంది. కానీ 1500 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నారు. రాజమండ్రి టికెట్‌ హైదరాబాద్‌ నుంచి 1500కి మించదు కాని.. 4వేల రూపాయలుకి అమ్ముతున్నారు. నాన్‌ ఏసీ అయితే 2వేలు ఉంది. వైజాగ్‌కు ఆర్టీసీ బస్సులో 2వేల రూపాయల్లోపే టికెట్‌ ఉంటే.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు 3వేల నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్‌ అయితే 6వేల రూపాయ‌ల దాకా చార్జ్ చేస్తున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు.

మరిన్ని రాష్ట్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..