మీనాక్షి చౌదరి క్రేజ్ మాములుగా లేదు..ఏకంగా ఏడు సినిమాలతో బిజీ!

10 January 2025

samatha

బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరస సినిమాలతో బిజీ అవుతోంది.

మాస్ మహారాజా రవితే ఖిలాడీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.

ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తర్వాత అడవి శేష్ హిట్ ది సెకండ్ కేసు మూవీతో వచ్చి హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

 ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు లక్ కలిసి వచ్చిందనే చెప్పాలి, ఏకంగా మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ కొట్టేసింది.

మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసి, అభిమానులను ఆకట్టుకుంది.

దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాతం పెరిగిపోయింది. ప్రస్తుతం మీనాక్షి ఏడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ, రిలీజ్ కాగా,వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది.

అంతే కాకుండానవీన్ పొలిశెట్టితో అనగనగా ఒకరాజు సినిమాలో కనిపించనుంది. ఇవే కాకుండా తమిళంలో మరో రెండు సినిమాలతో బిజీ ఉన్నట్లు సమాచారం.