Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ ప్రముఖుల కీలక భేటీ.. ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దటు, నిర్మాతలు, నటులు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సీఎం చంద్రబాబును కలవనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు.

Andhra News: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ ప్రముఖుల కీలక భేటీ.. ఎప్పుడంటే!
Anand T
|

Updated on: Jun 14, 2025 | 1:57 PM

Share

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దటు, నిర్మాతలు, నటులు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సీఎం చంద్రబాబును కలవనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలిసింది లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ను మాత్రమే కలిశారు. అయితే, ఇటీవల థియేటర్ల బంద్‌కు సంబంధించిన విషయంపై స్పందించిన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సినీ ప్రముఖులు ఒక్కసారైన సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని థియేటర్‌ల పరిస్థితిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేశారు.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పలు థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. కాగా ఇప్పుడు ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను సినీ ప్రముఖులు కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. మొదటగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత.. ఆయనతో కలిసి సినీ ప్రముఖలు సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఏపీలో సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై సీఎం సినీ పెద్దలు చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానుట్టు తెలుస్తోంది.

సీఎంతో జరిగే సమావేశానికి హాజరుకానున్న సినీ ప్రముఖులు వీరే…

అయితే సీఎం చంద్రబాబుతో కలిసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి సుమారు 35 నుంచి 40 మంది వరకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. వారిలో దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉండగా, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు ఉన్నారు. వీరితో పాటు నటులు బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని ఉన్నారు.

ఈ నెల 21న అరుదైన యోగాలు.. ఈ పరిహారాలు చేయండి విజయం మీ సొంతం
ఈ నెల 21న అరుదైన యోగాలు.. ఈ పరిహారాలు చేయండి విజయం మీ సొంతం
NEET PG 2025 పరీక్ష మూల్యాంకనంపై సందేహాలు.. సుప్రీంలో పిటిషన్లు
NEET PG 2025 పరీక్ష మూల్యాంకనంపై సందేహాలు.. సుప్రీంలో పిటిషన్లు
పాక్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. పుట్టుకొచ్చిన మరో కొత్తపార్టీ!
పాక్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. పుట్టుకొచ్చిన మరో కొత్తపార్టీ!
కోహ్లీ, రోహిత్ 2027 ప్రపంచ కప్ ఆడతారా? బీసీసీఐ క్లారిటీ
కోహ్లీ, రోహిత్ 2027 ప్రపంచ కప్ ఆడతారా? బీసీసీఐ క్లారిటీ
Rajasthan CCTV Video: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో సర్పంచ్‌పై దాడి...
Rajasthan CCTV Video: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో సర్పంచ్‌పై దాడి...
APPSC 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు..
APPSC 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు..
భీముడు నిర్మించిన పరశుర సరస్సు నేటికీ లోటు ఎంతో కనిపెట్టని సైన్స్
భీముడు నిర్మించిన పరశుర సరస్సు నేటికీ లోటు ఎంతో కనిపెట్టని సైన్స్
అప్పట్లో కుర్రాళ్లను కవ్వించిన ఈ నటి గుర్తుందా.?
అప్పట్లో కుర్రాళ్లను కవ్వించిన ఈ నటి గుర్తుందా.?
సమంత,చిరంజీవి కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సమంత,చిరంజీవి కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సనత్ జయసూర్య జీవితంలో మూడు పెళ్లిళ్లు ఎందుకు ఫెయిలయ్యాయి ?
సనత్ జయసూర్య జీవితంలో మూడు పెళ్లిళ్లు ఎందుకు ఫెయిలయ్యాయి ?