Bigg Boss Telugu 6 :బిగ్ బాస్‌లోకి ఆ చైల్డ్ ఆర్టిస్ట్.. హౌస్‌లోకి అతడు కూడా..
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది ప్రేక్షకులంతా ఎప్పుడా ఇప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 6 ను సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం చేయనున్నారు.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss Telugu 6 )కొత్త సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది ప్రేక్షకులంతా ఎప్పుడా ఇప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 6 ను సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం చేయనున్నారు. ఇప్పటివరకు విజయవంతంగా 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 6 లోకి అడుగుపెట్టనుంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుంది. ఎవరెవరు పాటిస్పెట్ చేయనున్నారన్నవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా..
ఇక ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌ని హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్‌లో క్వారంటైన్‌కి పంపబోతున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించనున్నారు. వారు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది..ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. మాస్టర్ భరత్ గుర్తున్నాడా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో కటౌట్ లోకి మారిపోయాడు. ప్రస్తుతం భరత్ సినిమాలు తగ్గించాడు. మంచి ఛాన్స్ వస్తే మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇప్పుడు భరత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలానే హౌస్ లోకి వెళ్ళేవారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు గ్రాండ్ గా ఎంట్రీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా..’ అని ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ కూడా వినిపించింది. ‘బిగ్ బాస్ సీజన్ 6.. ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్’ అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది.