స్టేజ్ పైనే అందరుచూస్తుండగానే ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. మొత్తానికి లవ్ లో పడిందిగా..
బుల్లితెర పై తన అందంతో.. చలాకీతనంతో ఆకట్టుకుంటున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. తనదైన హోస్టింగ్ తో షో కు నూతన ఉత్సాహాన్ని తీసుకురావడం..
SreeMukhi: బుల్లితెర పై తన అందంతో.. చలాకీతనంతో ఆకట్టుకుంటున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. తనదైన హోస్టింగ్ తో షో కు నూతన ఉత్సాహాన్ని తీసుకురావడం.. కామెడీ టైమింగ్ తో నవ్వించడం… స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడం ఈ అమ్మడి స్పెషాలిటీ. ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో హాట్ టాపిక్ గా మారింది ఈ అందాల యాంకర్. గతంలో తాను ప్రేమలో పడ్డానని, ఆతర్వాత బ్రేకప్ అయ్యిందని, ఆ డిప్రషన్ నుంచి బయటకు రావడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని చెప్పుకొంచింది. ఇప్పుడు శ్రీముఖి మరో సారి ప్రేమలో పడిందా..? అదికూడా కో యాంకర్ తోనా..? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు.. స్టేజ్ పై అందరు చుస్తుండగా శ్రీముఖి లవ్ ప్రపోజ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. శ్రీముఖి ఐ లవ్ యూ చెప్పింది ఎవరికో కాదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు శ్రీముఖి మనసులో మాట చెప్పేసింది.
ప్రముఖ ఛానల్ లో జరుగుతున్న ఓ షోకు ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. మెగాస్టార్ శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి. స్టేజ్ పైన సిగ్గుపడుతూ ముద్దుముద్దుగా ఐలవ్యూ అంటూ చెప్పింది. దానికి ప్రదీప్ కూడా సిగ్గుపడ్డాడు. ఈ సీన్ చూసి సింగర్ సునీత, ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి ఆశ్చర్య పోయారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :