Anchor Ravi: ఊహించని గెటప్ లో యాంకర్ రవి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
వీడు మాయ గాడు... ఊహకందనోడు.. ఊ...సరవెల్లి... ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలోని ఈ టైటిల్ సాంగ్ మీకందరికి గుర్తుంది కదా...
వీడు మాయ గాడు… ఊహకందనోడు.. ఊ…సరవెల్లి… ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలోని ఈ టైటిల్ సాంగ్ మీకందరికి గుర్తుంది కదా…! ఇప్పుడీ పాట లిరిక్స్‌ను గుర్తు చేసుకుంటూ మరీ…! సోషల్ మీడియాలో యాంకర్ రవిని ట్రోల్ అండ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ నుంచి తన క్రియేటివిటీని బాగా ఉపయోగిస్తూ.. ఇన్‌స్టా వీడియోలు చేస్తున్న రవి… తాజాగా ఓ షో కోసం క్రేజీ కాంచన గెటెప్‌లోకి మారారు రవి. “బుల్లి తెర ప్రేక్షకులకే కాదు.. నెట్టింటి నా అభిమానులకు.. నా గెటప్ను పరిచయం చేసేద్దాం..” అని అనుకున్నారో ఏమో కాని.. ఆ క్రేజీ కాంచన వీడియోను రవి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఎర్ర సారీతో…. ఎరుపు రంగు బిల్ల బొట్టుతో.. కాస్త భయంకరంగా ఆ వీడియోలో కనిపిస్తూనే.. నెటిజెన్లందర్నీ నవ్వించే ప్రయత్నం చేశారు ఈ క్రేజీ బాయ్.
ఈ వీడియోనే కాదు… ఇంతకు ముందు కూడా ఇలాంటి ఓ వీడియోనే పోస్ట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు రవి. ఆ వీడియోలో జులపాల జుట్టుతో… అరుంధతి కోసం ఆత్రంగా ఎదురు చూసే పశుపతి క్యారెక్టర్లో కనిపించారు. ఆ… సూపర్.. ఇది కదా అన్నా నీ వర్జినల్ క్యారెక్టర్ అని నెట్టింట అందరిచేత ఫన్నీగా అనిపించుకుంటున్నారు కూడా..! ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. ఈ క్రేజీ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :