Devayani: హీరోయిన్ దేవయాని కూతురిని చూశారా.. ? సరిగమప షోలో ఇరగదీసిందిగా…
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు దేవయాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టి్స్టుగా మెప్పించింది. ఇప్పటికీ సినీరంగంలో చాలా యాక్టివ్ గా ఉంది.

దేవయాని.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోని భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అయితే దేవయాని పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియదు. ఈ హీరోయిన్ తమిళ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాజకుమారన్ ను 2001లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు.. దీంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇప్పుడు దేవయాని కూతురు ఇనియా సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
తల్లిలాగే సినీరంగంలోకి హీరోయిన్ గా, నటిగా ఎంట్రీ ఇవ్వకుండా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. దేవయాని కుమార్తె ఇనియా ఇప్పుడు సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం జీ తమిళ్ ఛానల్లో ప్రసారమయ్యే సరిగమప సీనియర్ సీజన్ 5లో అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో దేవయాని తన పెద్ద కూతురు ఇనియాను స్టేజ్ పైకి స్వయంగా తీసుకువచ్చింది. జడ్జీల కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా.. ఇనియా భారతి చిత్రంలోని “మయిల్ పోల పొన్ను ఒన్ను” పాటను మరింత అందంగా పాడింది. ఆ తర్వాత కళ్లకు గంతలు తీసేసిన న్యాయనిర్ణేతలు ఆ అమ్మాయి దేవయాని కూతురు అని తెలిసి ఆశ్చర్యపోయారు.
తన కూతురు ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ షో ప్రోమో నెట్టింట వైరలవుతుంది. దేవయాని కూతురు ఇనియా పాడిన పాట భారతి చిత్రంలోనిది. 2000లో విడుదలైన మహాకవి భారతీయార్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన సినిమా ఇది. జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవయాని కథానాయికగా నటించింది. ఈఫాటను ఇళయరాజా కూతురు దివంగత గాయని భవతరాణి పాడడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..



