AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mogalirekulu Serial: ‘మొగలి రేకులు’ ఫేమ్ దయ మృతికి కారణాలివే !.. ఎవరికీ చెప్పుకోని పవిత్రనాథ్..

ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్‎గా ఉన్న ఆయన గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. అటు ఇండస్ట్రీ స్నేహితులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం పవిత్రనాథ్ భార్య శశరేఖ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్తకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని.. తన ముందే చాలా మంది అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను వేధించేవాడని.. అతడితోపాటు అత్తమామల వేధింపులు కూడా ఉన్నాయని ఆరోపించింది. 2012లో అతడిపై ..

Mogalirekulu Serial: 'మొగలి రేకులు' ఫేమ్ దయ మృతికి కారణాలివే !.. ఎవరికీ చెప్పుకోని పవిత్రనాథ్..
Pavitranath
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2024 | 12:37 PM

Share

మొగలిరేకులు సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి బుల్లితెర ఇండస్ట్రీని షాక్‏కు గురిచేసింది. ఒకప్పుడు తన నటనతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ ఇలా ఆకస్మాత్తుగా మరణించిన విషయాన్ని నటీనటులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు దయ మరణించడానికి కారణాలు ఏంటీ అంటూ ఆరా తీస్తున్నారు. అయితే పవిత్రనాథ్ ఇంత చిన్న వయసులోనే కన్నుమూయడానికి కారణం మానసిక కుంగుబాటు అని తెలుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్‎గా ఉన్న ఆయన గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. అటు ఇండస్ట్రీ స్నేహితులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం పవిత్రనాథ్ భార్య శశరేఖ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్తకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని.. తన ముందే చాలా మంది అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను వేధించేవాడని.. అతడితోపాటు అత్తమామల వేధింపులు కూడా ఉన్నాయని ఆరోపించింది. 2012లో అతడిపై .. అత్తమామలపై కేసు పెట్టింది. కొన్నాళ్లగా వాళ్లు కూడా ఆమె పై కేసు పెట్టారు. అయితే తన భార్య తనపై చేసిన ఆరోపణలపై పవిత్రనాథ్ ఎప్పుడూ స్పందించలేదు.

ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు పవిత్రనాథ్. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ ద్వారా అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో కనిపించాడు. చివరిసారిగా అతడు కృష్ణ తులసి అనే సీరియల్లో మల్లికార్జున్ పాత్రలో నెగిటివ్ రోల్ చేశాడు. పవిత్రనాథ్ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మానసికంగా చాలా కుంగిపోయాడని అతడి సన్నిహితులు చెప్తున్నారు. ఆరేళ్ల క్రితం అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని… అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితులు అతడిని మానసికంగా ఒత్తిడికి గురిచేశాయి. కొన్నాళ్లుగా తీవ్ర మనోవేదనతోపాటు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవిత్రనాథ్.. ఆరోగ్యం క్షీణించడంతోనే మరణించాడని అంటున్నారు.

నాలుగు రోజుల క్రితం ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారట. అప్పటికే పరిస్థితి విషమించడంతో హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా పవిత్రనాథ్ మరణించాడని సన్నిహితులు చెబుతున్న మాట. పవిత్రనాథ్ మరణంపై మొగలిరేకులు సీరియల్ రైటర్ కమ్ డైరెక్టర్ బిందునాయుడు విచారం వ్యక్తం చేశారు. మొగలి రేకులు సీరియల్లో కనిపించి దయ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు అని.. తనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని.. అతడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.