AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్ మహారాజ్..మీరు మారాలి..!

మాస్ రాజా రవితేజ..రేంజ్, కరేజ్, క్యాలిబర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన స్క్రిప్ట్ పడితే మాస్ మాస్ మహారాజ్‌ని ఆపడం ఎవ్వరితరం కాదు. కానీ ఆయన స్టోరీ సెలక్షన్‌‌లో మాత్రం వెనకబడిపోతున్నారు. ప్లాపు వెంట ప్లాపు పడుతోన్నా పద్దతి మార్చుకోవడం లేదు. రవితేజ రేంజ్‌కు తగ్గట్టు భారీగా పెట్టుబడులు పెడుతోన్న నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోతున్నారు. రీసెంట్‌గా రామ్ తలారి అనే నిర్మాత రవితేజతో ‘డిస్కో రాజా’ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం 80వ దశకం […]

మాస్ మహారాజ్..మీరు మారాలి..!
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2020 | 9:27 PM

Share

మాస్ రాజా రవితేజ..రేంజ్, కరేజ్, క్యాలిబర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన స్క్రిప్ట్ పడితే మాస్ మాస్ మహారాజ్‌ని ఆపడం ఎవ్వరితరం కాదు. కానీ ఆయన స్టోరీ సెలక్షన్‌‌లో మాత్రం వెనకబడిపోతున్నారు. ప్లాపు వెంట ప్లాపు పడుతోన్నా పద్దతి మార్చుకోవడం లేదు. రవితేజ రేంజ్‌కు తగ్గట్టు భారీగా పెట్టుబడులు పెడుతోన్న నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోతున్నారు.

రీసెంట్‌గా రామ్ తలారి అనే నిర్మాత రవితేజతో ‘డిస్కో రాజా’ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం 80వ దశకం నేపథ్యానికి సంబంధించింది కావడంతో..పరిస్థితుల దృష్ట్యా గోవా, మద్రాస్‌లో ఎక్కువగా చీత్రీకరించారు. కానీ సినిమా కంటెంట్ అంతంగా రంజిపచెయ్యకపోవడంతో అన్ని హక్కులను అమ్మినా సరే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. ఆ సినిమా భారీగా పాఠం చెప్పిన తర్వాత కూడా రవితేజలో మార్పు కనిపించడం లేదు. మరోసారి అదే ఓల్డ్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ‘సినిమా చూపిస్తా మామ’ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను మొదట విక్టరీ వెంకటేష్ తిరస్కరించారు. రివెంజ్ థీమ్ యాక్షన్ స్టోరీ కావడంతో ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 40 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరి రవితేజ అంత అమౌంట్ తిరిగి రాబట్టగలరా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు