Bro Movie: టీవీల్లోకి వచ్చేస్తోన్న మామ, మేనల్లుడి సినిమా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‏గా ‘బ్రో’..

హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ మూవీస్ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో చూస్తున్నారు ఫ్యాన్స్. చివరిసారిగా పవన్ బ్రో చిత్రంలో కనిపించారు. ఇందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించారు. మొదటిసారి మామ, మేనల్లుడు కలిసి నటించడంతో ఈ మూవీకి అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అటు ఓటీటీలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియ్ర గా

Bro Movie: టీవీల్లోకి వచ్చేస్తోన్న మామ, మేనల్లుడి సినిమా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‏గా 'బ్రో'..
Bro Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2023 | 8:33 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ మూవీస్ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో చూస్తున్నారు ఫ్యాన్స్. చివరిసారిగా పవన్ బ్రో చిత్రంలో కనిపించారు. ఇందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించారు. మొదటిసారి మామ, మేనల్లుడు కలిసి నటించడంతో ఈ మూవీకి అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అటు ఓటీటీలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియ్ర గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.

త్వరలోనే ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం కానుంది. అయితే ఈ మూవీని ఎప్పుడూ ప్రసారం చేయనున్నారనే క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు మరోసారి బుల్లితెరపై ఈ చిత్రాన్ని వీక్షించేందుకు రెడీ అవుతున్నారు మూవీ లవర్స్. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, అలీ రెజా కీలకపాత్రలలో నటించగా.. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే థియేటర్లలో, ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Zee Telugu (@zeetelugu)

ఇక వాల్తేరు వీరయ్య సినిమా సైతం టీవీల్లో అలరించేందుకు రెడీ అయ్యింది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి దసరా బుల్లితెరపై మెగా బ్రదర్స్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత వినోదం అందించనున్నారు.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.