Bigg Boss 7 Telugu: ‘ కట్టప్పనే క్రాస్ చేశావ్.. వాడుకొని ఆడుకోవాలని చివరకు వాడిపోయింది’.. రతిక‏ను ఓ ఆటాడుకున్న గీతూ..

ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధంతం చేయడం.. ఎక్స్ గురించి తీసుకురావడంతో ఆమె ఓటింగ్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో నాలుగో వారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ తర్వాత షాక్‏లో ఉండిపోయింది రతిక. బిగ్‏బాస్ స్టేజ్ పై ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఎలిమినేషన్ తర్వాత బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో రతికను ఓ ఆటాడుకుంది గీతూ.

Bigg Boss 7 Telugu: ' కట్టప్పనే క్రాస్ చేశావ్.. వాడుకొని ఆడుకోవాలని చివరకు వాడిపోయింది'.. రతిక‏ను ఓ ఆటాడుకున్న గీతూ..
Bigg Boss 7 Buzz Rathika
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2023 | 7:09 AM

బిగ్‏బాస్ సీజన్ 7 అంతా అనుకున్నట్లే నాలుగో వారం రతిక రోజ్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఆమె ఎలిమినేషన్ గురించి ముందే సోషల్ మీడియాలో చర్చ సాగింది. మొదటి రోజే క్యూట్ లుక్స్‏తో ఆకట్టుకున్న రతిక.. మొదటి వారంలోనే తనపై నెగిటివిటీని సంపాదించుకుంది. ప్రశాంత్‏, యావర్‍తో స్నేహంగా ఉన్నట్లు కనిపించి చివరకు వారిద్దరికే వెన్నుపోటు పొడిచింది. దీంతో ఆమెపై ఉన్న పాజిటివిటీ తగ్గి మరింత నెగిటివిటీ పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధంతం చేయడం.. ఎక్స్ గురించి తీసుకురావడంతో ఆమె ఓటింగ్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో నాలుగో వారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ తర్వాత షాక్‏లో ఉండిపోయింది రతిక. బిగ్‏బాస్ స్టేజ్ పై ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఎలిమినేషన్ తర్వాత బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో రతికను ఓ ఆటాడుకుంది గీతూ.

రావడంతోనే సూటి ప్రశ్నలతో రతికను అల్లాడించేసింది. అందరినీ వాడుకొని ఆడుకోవాలనుకుంది.. కానీ వాడిపోయింది అంటూ ఎంట్రీలోనే గాలి తీసేసింది. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాలోని కట్టప్పను క్రాస్ చేసినట్లుగా ఉంది నీ ఆట అంటూ రతికకు కౌంటరిచ్చింది. నేను ఎవర్ని వెన్నుపోటు పొడిచాను ?.. అంటూ తిరిగి అడిగింది రతిక. రెండు చేతులు కలిస్తేనే చప్పుట్లు వస్తాయి. ప్రశాంత్ విషయంలో ఫస్ట్ చేయి అందించిందే నువ్వు అంటూ అసలు విషయం బయటపెట్టింది. దీంతో నేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది రతిక. ఆ తర్వాత ఎక్స్ అనే ఎమోషన్ వాడుకున్నట్లు అనిపించింది. మీకు వాడుకోవడం బాగా అలవాటు కదా ? అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

వాడుకోవాలని నేను అనుకుంటే.. వాడుకునే టైం వచ్చినప్పుడు తప్పకుండా వాడుకునేదాన్ని అని రతిక అనగా.. ప్రశాంత్ హౌస్ లో నీ వల్లేనా ?.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడు అంటూ అదే తమ్ముడితో పేటా ఆడావ్ అంటూ ఉతికారేసింది గీతూ. ఇక ఆ తర్వాత రతికపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్, మీమ్స్ చూపించింది గీతూ. ముఖ్యంగా అందులో రతిక పాము కంటే ప్రమాదం అని ట్వీట్ చూపించడంతో.. బయటకు అలా నా గురించి వస్తే అది నా కర్మ అని చెప్పింది రతిక.. ఇక చివరగా ప్రశాంత్ ఫోటోని తగలబెట్టి.. రంగులు మార్చే ఊసరవెల్లి.. రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని.. అపరిచితుడిలా ఒక్కో యాంగిల్ చూపిస్తున్నాడని చెప్పేసింది. మొత్తానికి బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో రతికను ఓ ఆటాడుకుంది గీతూ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.