Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ హౌస్‌లోకి అమృతా ప్రణయ్! సెంటిమెంట్ వర్క్ఔట్ అయ్యేనా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాల్టీ గేమ్ షో ఏడు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇది వరకే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమోను కూడా స్టార్ మా విడుదల చేసింది.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాల్టీ గేమ్ షో ఏడు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇది వరకే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమోను కూడా స్టార్ మా విడుదల చేసింది. ‘ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ కొత్త లోగోను షేర్ చేశాడు నాగార్జున. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ 1న కొత్త బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమయ్యే అవకాశముంది. మరోవైపు ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ‘కంటెస్టెంట్స్ వీరే’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ప్రముఖ యూట్యూబర్లు, బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతోంది. అదేంటంటే.. ఈసారి హౌజ్ లోకి అమృతా ప్రణయ్ అడుగుపెట్టనుందట. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అమృత తన కొడుకు నిహాన్ తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.
సినిమాల్లోకి ఎంట్రీ!
ఈ క్రమంలోనే అమృతా ప్రణయ్ కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హౌజ్ లోకి వచ్చేందుకు ఆమె కూడా ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. ఇందులో ఎంత నిజముందో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తే తెలియదు. కాగా ఆ మధ్యన కార్తికేయ బెదురులంక 2012 మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది అమృతా ప్రణయ్. హీరో కార్తికేయతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. దీంతో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందనుకున్నారు. అయితే అదేమీ జరగలేదు.
అమృతా ప్రణయ్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
భర్తను చంపిన తండ్రి మీద కేసు..
కాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న జరిగిన ప్రణయ్ హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమృత తండ్రి వ్యాపారవేత్త మారుతీ రావు ఓ కిల్లర్ కి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించారు. తన భర్తను హత్య చేయించాడని మారుతీ రావు కూతురు అమృత తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ లో మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు పాల్పపడ్డారు.
We are bringing entertainment back with a BANG !!!!💥
Presenting the logo for the epic Season 8 of Bigg Boss!
Are you ready for an Infinity of fun and entertainment?! #BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/9Du8wdsa0Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 21, 2024
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.