Krishna Mukunda Murari,18 August: నా ప్రపంచం నువ్వే కృష్ణ అంటున్న మురారీ.. భవానికి తన ప్రేమ గురించి చెప్పేసిన ముకుంద..

ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అమ్మలేని లోటు ఎప్పుడూ తెలియలేదు.. నాకు మీరు దేవుడిచ్చిన అమ్మ లవ్ యూ అత్తయ్య.. అంటే.. నా కంఠం లో ప్రాణం ఉండగా ఈ ఇంటికి కోడలుగా ఎవరిని రానివ్వను.. నువ్వే నా కోడలు... అగ్రిమెంట్ లేదు ఏమీ నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను అనుకుంటుంది రేవతి.,.. ఇంతలో నందు. గౌతమ్ లు అక్కడికి వస్తారు.. పెద్దత్తయ్య.. మీరు ఒక మహా వృక్షం.. మేము అందరం మీతో పాటు మీ రక్షణలో మీరు చూపే బాటలో నడుస్తున్నాం.. మాకు గురువు మీరే దైవం మీరే.

Krishna Mukunda Murari,18 August: నా ప్రపంచం నువ్వే కృష్ణ అంటున్న మురారీ.. భవానికి తన ప్రేమ గురించి చెప్పేసిన ముకుంద..
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Aug 18, 2023 | 8:07 AM

మనసులోని ప్రేమని ఎవరి ఆలోచనలతో వారు ఒకరికొకరు చెప్పకుండా కృష్ణ, మురారీలు విడిపోతున్నారు.. మరోవైపు ముకుంద తన ప్రేమ పెళ్లి పీటలు ఎక్కుతుందని సంతోషంగా భవిష్యత్ ను కలలు కంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆగష్టు 18వ తేదీ కృష్ణ ముకుంద మురారీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం..  క్యాంప్ లో కృష్ణ వేణి మనం విలేజ్ కి వెళ్లి.. శిబిరాలకు రమ్మనమని అనౌన్స్ చేద్దామా అని అంటే.. ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఏడుస్తుంది.. ఏసీపీ సార్.. ఎందుకు సార్.. నన్ను వదిలి ఎలా వెళ్లాలనిపించింది మీకు అంటూ ఏడుస్తుంది కృష్ణ..

మరోవైపు మురారీ కారులో వెళ్తూ.. కృష్ణను గుర్తు చేసుకుంటాడు. నేను ఎక్కడవున్నా మీరు ఎక్కడ ఉన్నా ఎప్పటికి మీరే నా భర్త.. మీ మనసులో నేను లేకున్నా  సరే.. ఎప్పటికీ ఈ తాళిని ఇలాగే ఉంచుకుంటా.. మీరు నాకు ఏవేవో గిఫ్టులు ఇవ్వాలని చూశారు కానీ.. ఇది నాకు అసలైన గిఫ్ట్ అని కృష్ణ అనుకుంటుంది. ఆడదానికి పసుపు.. కుంకుమ కంటే పెద్ద గిఫ్ట్ ఏమీ ఉండదు. ఏమి చేస్తాం.. కొన్ని జీవితాలు ఇంతే అనుకుంటుంది కృష్ణ.

ఇవి కూడా చదవండి

మురారీకి రోడ్డుమీద వెళ్తున్న ఒక యువతి.. కృష్ణలా  కనిపిస్తుంది. మరోవైపు కృష్ణ శిబిరం దగ్గర మురారీ పేరు విని ఏసీపీ సార్ నా కోసం మళ్ళీ వచ్చారేమో అనుకుంటూ శిబిరం అంతా వెదుకుతుంది. ఏసీపీ సార్ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మరోవైపు మురారీ.. ఎవరిని చూసినా కృష్ణ అనుకుంటున్నాడు. ఓ యువతిని చూసి కృష్ణ అనుకుంటే.. ఏయ్ ఏమి చేస్తున్నావో అర్ధం అవుతుందా పిచ్చి పట్టిందా అని అంటే..సారీ చెబుతాడు మురారీ.. కృష్ణ శబిరం దగ్గర ఓ బాలుడి పేరు మురారీ అని ప్రేమగా హత్తుకుని వాళ్ళ అమ్మకి తిరిగి ఇస్తుంది.

గిఫ్ట్ లు గుర్తు చేసుకున్న ఫ్యామిలీ

భవానీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. రేవతి నీ గుర్తుగా నాకు సీతారాముల విగ్రహం ఇస్తావా.. క్యాంప్ అయిపోగానే తిరిగి వచ్చేది అయితే ఇలా అందరికి ఎందుకు గిఫ్టులు ఇస్తుంది.. మురారీ వచ్చాక క్యాంప్ నుంచి తిరిగి తీసుకుని వచ్చేయమని చెప్పాలి అనుకుంటే.. మరోవైపు ప్రసాద్ ..మధు కృష్ణ నీకు ఏమి గిఫ్ట్ ఇచ్చిందంటే రీల్స్ చేసుకోమని స్టాండ్ ఇచ్చింది.. మరి నీకు అంటే.. హౌ టూ క్విట్ ఆల్కహాల్ అనే పుస్తకం ఇచ్చింది.. ఎంతమైన కృష్ణ సెన్సిటివ్ రా అని ప్రసాద్ అంటే.. సుమ నాకు కృష్ణ కాసుల పేరు గిఫ్ట్ గా ఇచ్చింది అంటే.. నాకు నాలుగు చెమ్కీ చీరలు గిఫ్ట్ గా ఇచ్చిందని అలేఖ్య చెబుతుంది తన అత్తగారికి. చాలా బాగున్నాయి తెలుసా అంటుంది.

పెన్ డ్రైవ్ ను చూస్తున్న ఫ్యామిలీ..

మరోవైపు భవానీ 10 రోజుల క్యాంప్ కు వెళ్తూ ఈ గిఫ్టులు సర్వప్రయిజ్ లు ఏమిటి.. అయినా పెన్ డ్రైవ్ లో ఏముందో చూద్దామా అని ప్లే చేయమని అడుగుతుంది..

హాయ్ అలేఖ్య నీకు ఇష్టమైన ప్లేస్ ఇదే కదా.. మధు, అలేఖ్య మీ జంట చాలా బాగుంటుంది కానీ మీరు ఇద్దరూ ఒకరినొకరు నిందించుకోకుండా ఉంటె ఇంకా బాగుంటుందని అని చెబుతుంది. సరదాగా ఉండండి.. కానీ హ్యాపీగా ఉండండి..

మధు ఏదొక రోజు నిన్ను డైరెక్టర్ గా చూడాలని మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకో చిన్న సినిమాలు కూడా బాగా నడుస్తున్నాయి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. సుమలత అత్తయ్య సీరియల్స్ సినిమాలు చూస్తూ బాధపడకండి.. ప్రసాద్ మామయ్యను బాగా చూసుకోండి.. రేవతి అత్తయ్యకు కిచెన్ లో హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. ప్రసాద్ మామయ్య.. మందు అంతేది అప్పుడప్పుడు సరదాగా తీసుకోవాలి.. అదేదో ఉద్యమంలా తాగకండి.. లైట్ గా తీసుకోండి బ్రైట్ గా ఉండండి..

ముకుంద నీ అందానికి అల్లరి తోడైతే నీకు తిరుగుండదు.. దిగులు పడకు నీ లైఫ్ నువ్వు కోరుకున్నట్లుగా సంతోషంగా ఉంటుంది. అని చెబుతుంది. రేవతి అమ్మతల్లి అన్నపూర్ణమ్మ.. అందరికి కడుపునిండా భోజనం పెట్టడం కాదు.. తమరు కూడా కడుపు నిండా తీసుకోండి.. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అమ్మలేని లోటు ఎప్పుడూ తెలియలేదు.. నాకు మీరు దేవుడిచ్చిన అమ్మ లవ్ యూ అత్తయ్య.. అంటే.. నా కంఠం లో ప్రాణం ఉండగా ఈ ఇంటికి కోడలుగా ఎవరిని రానివ్వను.. నువ్వే నా కోడలు… అగ్రిమెంట్ లేదు ఏమీ నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను అనుకుంటుంది రేవతి.,.. ఇంతలో నందు. గౌతమ్ లు అక్కడికి వస్తారు.. పెద్దత్తయ్య.. మీరు ఒక మహా వృక్షం.. మేము అందరం మీతో పాటు మీ రక్షణలో మీరు చూపే బాటలో నడుస్తున్నాం.. మాకు గురువు మీరే దైవం మీరే.. మీరు ఎప్పుడూ సంతోషముగా ఉండాలి.. నందు, గౌతమ్ మీరు కూడా సంతోషంగా ఉండాలి.. మిస్ యు ఆల్ అని చెబుతుంది.. దీంతో భవానీ ఏమిటి మిస్ యు అని అంటుంది అంటూ ఆలోచనలో పడుతుంది.. ఇన్నాళ్లు కలిసి ఉండి ఈ చిన్న గ్యాప్ ని కూడా తీసుకోలేకపోతుందా.. అని భవానీ ఆలోచిస్తుంటే.. నందు.. తన లైఫ్ కోసం మా ఫ్యామిలీని వాడేసుకుంది.. అని నందు ఆలోచిస్తుంటే.. మరోవైపు ముకుంద నాకు అర్ధం అయింది.. కృష్ణ ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రాదు అని ముకుంద హ్యాపీ ఫీల్ అవుతుంది.

దేశ సరిహద్దులో ఉద్రిక్తత

మరోవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీటుగా బదులిస్తామని కన్నల్ చెప్పారు. అని వార్తలు విని అందరూ షాక్ తింటారు. ఆదర్శ్ అంటూ భవానీ కంట కన్నీరు పెడుతుంది..

మురారీ రోడ్డు మీద కూర్చుని కృష్ణను గుర్తు చేసుకుంటాడు. నా ప్రపంచం నువ్వే కృష్ణ.. నీ ప్రపంచంలో నేను లేను అనుకుంటాడు. శిబిరంలో కృష్ణ బాధితులకు వైద్య సహాయం అందిస్తుంది. మురారీ ఫోన్ చేస్తుంటే అది చూసుకోదు కృష్ణ.

రేపటి ఎపిసోడ్ లో..

బోలెడన్నీ జ్ఞాపకాలు వీటితోనే గడిపెయ్యాలి అంటూ కన్నీరు పెట్టుకుంటే.. భవానీ ముకుందని ప్రేమగురించి నిలదీస్తుంది..

బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..
IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..
అనుష్కను మధ్యలో లాగడం దేనికి? ఘాటుగా స్పందించిన సిద్ధూ!
అనుష్కను మధ్యలో లాగడం దేనికి? ఘాటుగా స్పందించిన సిద్ధూ!
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే