Chupulu Kalisina Subhavela: ‘చూపులు కలిసిన శుభవేళ’ సీరియల్ అర్జున్, ఇందు గుర్తున్నారా ?.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..
స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఈ హిందీ సీరియల్ తెలుగు, తమిళ్, బెంగాలీ అన్ని భాషల్లోనూ మెప్పించింది. ఇక ఇందులో ఇందు, అర్జున్ సింహ నాయుడు పాత్రలకు వచ్చిన ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ రెండు పాత్రలను ప్రేమిస్తుంటారు ఆడియన్స్. అర్జున్ సింహ రాయుడు పాత్రలో బరున్ శోబ్తి, ఇందులో పాత్రలో సనయ ఇరానీ జీవించేశారు. దాదాపు కొన్నేళ్లపాటు ఈ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు.

‘చూపులు కలిసిన శుభవేళ’ ఈ సీరియల్ ఇష్టపడని వారుండరు. అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులనే కాదు.. యూత్‌ను ఆకట్టుకున్న సీరియల్. మొగలిరేకులు తర్వాత ఆడియన్స్ మనసులను దొచుకున్న సీరియల్. అయితే హిందీలో మంచి రెస్పాన్స్ అందుకున్న (iss pyaar ko kya naam doon?) సీరియల్‌ను తెలుగులో డబ్ చేయగా ఆదరణ సొంతం చేసుకుంది. 2012లో స్టార్ ప్లస్ లో ప్రారంభమైన ఈ సీరియల్ కు బుల్లితెరపై మంచి విజయం సాధించింది. స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఈ హిందీ సీరియల్ తెలుగు, తమిళ్, బెంగాలీ అన్ని భాషల్లోనూ మెప్పించింది. ఇక ఇందులో ఇందు, అర్జున్ సింహ నాయుడు పాత్రలకు వచ్చిన ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ రెండు పాత్రలను ప్రేమిస్తుంటారు ఆడియన్స్. అర్జున్ సింహ రాయుడు పాత్రలో బరున్ శోబ్తి, ఇందులో పాత్రలో సనయ ఇరానీ జీవించేశారు. దాదాపు కొన్నేళ్లపాటు ఈ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు.
ఈ సీరియల్ తర్వాత సనయ హిందీలో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా.. పలు సీరియల్స్ కూడా చేసింది. వీరిద్దరి కాంబోలో మళ్లీ వచ్చిన ఇష్క్ వాలా లవ్ సీరియల్ సైతం విజయాన్ని అందుకుంది. ఇందు చివరగా నాచ్ బలియే 8 షోలో పాల్గోంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సనయ.. 2016లో తన సహనటుడు మోహిత్ సెహగల్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సనయ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.




View this post on Instagram
ఇక అర్జున్ సింహ రాయుడు పాత్రలో బరున్ శోబ్తి నటించారు. చూపులు కలిసిన శుభవేళ సీరియల్ తర్వాత బరున్ మెయిన్ ఔర్ మిస్టర్ రైట్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రల్లో కనిపించాడు. అలాగే బరున్ నటించిన యే రిస్తా క్యా కహ్లాతా హై సీరియల్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. బరున్ తన చిన్ననాటి స్నేహితురాలు షష్మీన్ ను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి సిఫాత్ అనే కుమార్తె ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




