Rowdy Rohini: ఆస్పత్రి పాలైన రౌడీ రోహిణి.. బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో
అయ్యో.. రోహిణికి ఏమైంది. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే తను ఎందుకు ఆస్పత్రిలో చేరింది. తనకు సపర్యలు చేస్తున్న మహిళ ఎవరు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

నటి రోహిణి తెలియని తెలుగు లోగిలి ఉండదంటే అతిశయోక్తి కాదు. తను ఇప్పుడు ఫుల్ బిజీ ఆర్టిస్ట్. ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోస్‌లో నటిస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. తన కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. తను మాట్లాడే విధానం కూడా విభిన్నంగా ఉండి నవ్వు తెప్పిస్తుంది. అయితే ఇటీవల రోహిణి ఆస్పత్రి పాలవ్వడంతో.. ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే పెద్దగా కంగారు పడాల్సిన పనేం లేదు. కాలు సర్జరీ కోసం తనే స్వయంగా ఆస్పత్రికి వెళ్లింది. అయితే సర్జరీ చేయడం కుదరదని డాక్టర్లు చెప్పినట్లు వివరించింది. ఈ మేరకు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వీడియోలో వివరాలు వెల్లడించింది.
దాదాపు 5 ఏళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ తర్వాత తన కాలులో రాడ్ వేసినట్లు రోహిణి తెలిపింది. దాన్ని తీయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. వరుస షూటింగ్స్ వల్ల వీలు కుదరలేదని వివరించింది. ఇప్పు కాస్త ఫ్రీ టైమ్ దొరకడంతో.. రాడ్ తీయించి.. రెస్ట్ తీసుకోవాలనుకున్న తనకు నిరాశే ఎదురైంది. బాగా ఆలస్యం చేయడం వల్ల రాడ్ రోహిణి స్కిన్‌కు అటాచ్ అయిపోయిందని డాక్టర్లు పేర్కొన్నారు. బలవంతంగా తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో రాడ్ తొలగించకుండా ఆమె కాలుకి మైనర్ సర్జరీ చేశారు డాక్టర్లు. ప్రజంట్ ఆస్పత్రిలోనే రెస్ట్ తీసుకుంటుంది రోహిణి.
ఈ సందర్భంగా తనకు సపర్యలు చేస్తున్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యింది రోహిణి. “హ్యాపీ మదర్స్ డే అమ్మా….ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్… నువ్వు లేకుండా నేను ఏమీ కాదు. నువ్వే నా సర్వస్వం. నీ కోసం ఏమైనా చేస్తాను..” అని క్యాప్షన్ పెట్టి.. సదరు వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




