AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్‌ను వదిలేయడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన స్టార్ హీరో

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పూర్తయ్యింది. సుమారు మూడు నెలల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో సీరియల్ నటుడు నిఖిల్ మల్లయల్ విజేతగా నిలిచాడు. అలాగే డాక్టర్ బాబు గౌతమ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.

Bigg Boss: బిగ్ బాస్‌ను వదిలేయడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన స్టార్ హీరో
Bigg Boss Show
Basha Shek
|

Updated on: Dec 17, 2024 | 6:30 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు ఇటీవలే ఎండ్ కార్డ్ పడగా త్వరలోనే బిగ్ బాస్ కన్నడ కూడా ముగియనుంది. కాగా ఇప్పటి వరకు కిచ్చా సుదీప్ వరుసగా 11 సీజన్లలో కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే 12వ సీజన్‌ నుంచి అతను తప్పుకున్నాడు. ఈ విషయంపై సుదీప్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులకు తెలియజేశాడు. అయితే ఆ నిర్ణయం వెనుక కారణాలేవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. దీనిపై సుదీప్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. సినిమాల షూటింగ్ మధ్యలో బిగ్ బాస్ కోసం సమయం కేటాయించడం చాలా కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుదీప్ చెప్పుకొచ్చాడు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మ్యాక్స్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇందుకోసం అతను తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో బిగ్ బాస్ పై ఓ ప్రశ్న ఎదురైంది. ఈ వేదికపైనే బిగ్ బాస్ షోకి ఎందుకు గుడ్ బై చెప్పాడో అసలు కారణం చెప్పాడు సుదీప్. ‘గత సీజన్‌లో మహాబలిపురంలో నా సినిమా షూటింగ్ జరుగుతోంది. చెన్నై నుంచి అక్కడికి చేరుకోవడానికి గంటన్నర పడుతుంది. బెంగళూరు నుంచి అక్కడికి వెళ్లి, అక్కడ షూట్ చేసి, అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని, ప్రైవేట్ విమానంలో బెంగళూరుకు తిరిగి వచ్చి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి, వీకెండ్ ఎపిసోడ్ షూట్ చేయాలి. ప్రతీసారి ఇలా చేయడం చాలా కష్టం’

‘మనం బెంగుళూరులో ఉంటే ఫర్వాలేదు. సినిమా షూటింగ్ వేరే చోట ఉంటే సరిగ్గా కుదరదు. నేను ఎక్కడ ఉన్నా గురువారానికి షూటింగ్ పూర్తి చేసి శుక్రవారం బిగ్ బాస్ కు అందుబాటులో ఉండాలి. సినిమాలు లేనప్పుడు సరే. సినిమా షూటింగ్ ఉంటే లేట్ అవుతుంది. ఇన్నేళ్లూ హ్యాపీగా చేశాను. ఇప్పుడు మరొకరిని చేయనివ్వండి’ అని సుదీప్ క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మ్యాక్స్ సినిమాలో కిచ్చా సుదీప్..

కాగా సుదీప్ తర్వాత బిగ్ బాస్ కన్నడ షోకి ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ‘ నా తర్వాత ఎవరైనా ఈ షోకు హోస్ట్ గా రావచ్చు. అయితే మీరు నాలా చేయాలనుకుంటున్నారా లేదా అనేది మరొక ప్రశ్న. ఆ పోలిక తీసుకు రావొద్దు. ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిత్వం ఉంటుంది’ అని సుదీప్ తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే
ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే