Karthika Deepam Serial: పిల్లల కోసం బయలుదేరిన కార్తీక్.. అయినా మోనిత వైపే ఆలోచనలు.. మరోవైపు ఆసుపత్రిలో దీప..

Karthika Deepam serial today: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. ఈరోజు (2021 మార్చి 27)న 998 ఎపిసోడ్‌ లోకి అడుగు పెట్టింది;. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది...

Karthika Deepam Serial: పిల్లల కోసం బయలుదేరిన కార్తీక్.. అయినా మోనిత వైపే ఆలోచనలు.. మరోవైపు ఆసుపత్రిలో దీప..
Karthika Deepam Serial Marc
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Mar 27, 2021 | 2:11 PM

Karthika Deepam latest episode : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. ఈరోజు (2021 మార్చి 27)న 998 ఎపిసోడ్‌ లోకి అడుగు పెట్టింది;. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది.. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

టిఫిన్ తింటున్న సమయంలో కార్తీక్ .. తండ్రి ఆనందరావుల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. దీంతో ఆనందరావు.. వీడు మారడు అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. దీంతో కార్తీక్ .. నేను పిల్లలకు అన్యాయం చేశానా.. నేను హిమ అనాథని తెలిసినప్పుడు ఎలా ప్రేమించానో.. దీప కూతురు అని తెలిసాక కూడా అంతె ప్రేమించాను కదా..! శౌర్య దీప కూతురు అని తెలిసినా దానిని ఏనాడైనా బాధపెట్టే మాట అన్నానా..! పిల్లలిద్దరూ దూరమైతే నేను బాధపడినా.. నా వైపు నుంచి ఎవరూ ఆలోచించరు ఎందుకు మమ్మీ అని అడుగుతాడు.. ఈ ప్రశ్నకు ఒక స్త్రీగా జవాబు చెప్పనా అయితే అమ్మగా.. తల్లిగా అత్తగా ఎవరిగా పరిష్కారం చెప్పను.. నీ ప్రేమ నిజం.. మా అమ్మకం నిజం.. ఈ రెండిటి సరిహద్దు రేఖ మీద నిలబడి నువ్వు.. ఏవైపు వెళ్తావో తెలియక మేము… మా అందరికీ ఆ సరిహద్దు ఎప్పుడు చెరిగిపోతుందో అని ఆశ.. నీకు ఒక ఆట.. ఆడపిల్లలు ఆటబొమ్మలు కాదు.. మరి నన్ను ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు మమ్మీ అమ్మ మాటగా వింటాను.. నువ్వు నీ పిల్లల గురించి వారి సెక్యూరిటీ గురించి ఆలోచించేవాడివి ఐతే నేను ఒక పరిష్కారం చెబుతాను. అంటుంది సౌందర్య.. చెప్పు అనగానే.. దీప నీకు భార్యగా అక్కర్లేదు.. కానీ నాకు నా కోడలు కావాలి.. ఆ పిల్లలకు తల్లిగా తీసుకుని రా.. అంటుంది.. అంతేకాని పిల్లల కోసం పిల్లలని తల్లిని వేరు చేసి అన్యాయం చేయకు .. అది న్యాయం కాదు అమానుషం అంటుంది.

భాగ్యం టిఫిన్ తింటూ.. మురళీ కృష్ణకు ఫోన్ చేస్తుంది. నువ్వు ఫోన్ ఎత్తడమే నాకు మహా భాగ్యం అంటుంది.. దీప కనిపిస్తే త్వరగా ఇంటికి తీసుకుని రా అంటుంది. టిఫిన్ తిన్నావా అంటే.. తిన్నాను అంటాడు మురళీ కృష్ణ. త్వరగా దీపని తీసుకుని రా.. వాళ్ళ అత్తగారు మనిషి మనిషిలో లేరు.. అంటుంది భాగ్యం.

ఇక మరోవైపు ప్రియమణి మోనిత కు టీ ఇస్తూ.. హాస్పటల్ కి వెళ్తున్నారా అమ్మా అని అడుగుతుంది. ఇంతకీ ఆ దీపమ్మ, పిల్లలు శ్రీకాకుళంలో ఉన్నట్లు కార్తీక్ అయ్యకు చెప్పరామా అమ్మా అంటుంది.. అదే సమయంలో కార్తీక్ మోనిత ఇంట్లోకి అడుగు పెట్టడానికి తలుపులు తీస్తాడు.. కార్తీక్ ని గమనించిన మోనిత హుషారుగా.. శ్రీకాకుళంలో కాదు ఉంది పిచ్చిమొఖమా.. విజయనగరంలోని గంట స్థంభం సెంటర్లోనే ఉంటున్నారు.. ఒక గంట ముందు నేను వెళ్లి ఉంటె బాగుండేది.. ఆ మురళీ కృష్ణ వాళ్ళను వెదుకుతూ వచ్చారు.. అదివిన్న కార్తీక్ చాలా సంతోష పడతాడు.. మనసులో పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది.. అని అనుకుంటాడు..

అదే సమయంలో మోనిత .. నాకు నచ్చనిది అబద్ధం చెప్పడం.. కార్తీక్ కి అంటేనే అసహ్యం. అయితే నాకు ఎందుకు దీప అడ్రస్ దొరకలేదు అని చెప్పింది అని ఆలోచిస్తాడు కార్తీక్.. మురళీ కృష్ణ కి దీప గురించి తెలిసినా ఎందుకు చెప్పలేదు.. అని ఆలోచిస్తూ.. ఇవన్నీ నాకు అనవసరం.. నాకు కావాల్సింది పిల్లలు.. ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకుంటాడు.. పిల్లల కోసం బయలుదేరతాడు..

మరోవైపు దీప టిఫిన్ సెంటర్ ముందు సర్వ్ చేస్తూ కళ్ళుతిరిగి పడిపోతుంది. అందరూ కంగారుపడతారు.. ఇక జర్నీలో కార్తీక్ మళ్ళీ మోనిత గురించి ఆలోచిస్తాడు.. అప్పుడు కూడా మోనిత వైపే పాజిటివ్ గా ఆలోచిస్తూ.. పిల్లల అడ్రస్ మురళీ కృష్ణ చెప్పలేదు.. నేను దిగి వచ్చే వరకూ నా వాళ్ళు కూడా చెప్పకూడదు అనుకున్నారు అంటూ.. నిర్ధారించుకుంటాడు.

ఆస్పత్రిలో దీపకు సృహ వస్తుంది. ఏమన్నారు. ఏమన్నారు.. వేలకు వేలకు ఖర్చు చేసే టెస్టులు రాశారా.. అంటుంది.. ఖర్చుకోసం వెనకాడకు.. నేను చేయిస్తా అంటాడు మురళీ కృష్ణ. నీ డబ్బు మాత్రం డబ్బు కదా..? టెస్టులు అవసరం లేదు అంటుంది దీప.. నేను వెళ్ళిపోతే.. పిల్లలని పట్టుకుని ఒక్కదానివి ఉండాలి కదా..? అంటాడు మురళీ కృష్ణ.. తప్పదమ్మా .. నా జాతకం అంతే కదా నాన్నా.. ఈ అత్తగారికి నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే.. ఈసారి మీ అత్తగారు నిన్ను వదిలి పెట్టదు.. అప్పుడు నా భర్త ఇల్లు వదిలి మోనిత ఇంట్లో దుకాణం పెడతాడు.. కోడలి కోసం కొడుకుని వదులుకుంటారా నాన్నా.. అంటుంది దీప.. లేదమ్మా ఈ టెస్టులు అన్నీ చూస్తుంటే ఎందుకో నాకు భయంగా ఉంది.. అక్కడైతే అందరూ ఉంటారు.. అత్త, మామ, మరది, చెల్లి అందరూ ఉంటారు.. ఒక్క ఆయన తప్ప.. అయన అంతట ఆయన నిజం తెలుసుకుని పిలిస్తే పనికిమానిలిన సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదులుకుని వెళ్ళనా.. అంటుంది. ఇంటికి వెళ్లి పిండి రుబ్బాలి.. ఒక్క రోజు కూడా బండి మూతపడకూడదు. అంటుంది. హిమ, శౌర్యలకు ఆకలి వేసి.. ఎం చెయ్యాలి అనుకుంటారు. పొద్దున్న ఇడ్లి ఉంది అది తిందామా అంటుంది హిమ.. వద్దు ఇందకబ్రెడ్ జామ్ తెచ్చా.. అది తిందాం.. అంటుంది.. ముందు శౌర్య హిమకి తినిపించే ప్రయత్నం చేస్తుంది. అదేంటి.. ఆకలి నాకు అలవాటు అయ్యిపోయింది. ఒకొక్కసారి ఆకలివేస్తే.. అమ్మ బియ్యం తెచ్చే వరకూ ఆకలి లేదు అన్నట్లు ఉండడం అలవాటు అయిపోయింది.. ముందు నువ్వు తిను అంటుంది శౌర్య.. మరి కార్తీక్ .. దీప ఇంటికి వస్తాడా..? పిల్లల్ని మాత్రమే తీసుకుని తెచ్చుకుంటాడా..? లేక దీప పరిస్థితి చూసి .. ఏ నిర్ణయం తీసుకుంటాడు తెలియాలంటే.. సోమవారం వరకూ ఆగాల్సిందే..!

Also Read: ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టం చేసిన బోర్డు .. ఆ రెండు పరీక్షలను విద్యార్థులు ఇంటినుంచి రాసే అవకాశం Gold and Silver Price : దేశీయ మార్కెట్ లో దిగి వచ్చిన బంగారం ధరలు, కొంతమేర పెరిగిన వెండి