Gold and Silver Price : దేశీయ మార్కెట్ లో దిగి వచ్చిన బంగారం ధరలు, కొంతమేర పెరిగిన వెండి

గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి భారీగా కేసులు నమోదవుతున్నా.. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో...

Gold and Silver Price :  దేశీయ మార్కెట్ లో దిగి వచ్చిన బంగారం ధరలు, కొంతమేర పెరిగిన వెండి
Gold And Silver
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2021 | 6:43 AM

Gold and Silver Price:గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి భారీగా కేసులు నమోదవుతున్నా.. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలో వెండి ధరలు భారీగా దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 300 తగ్గి 41,700కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.45,490కి చేరింది.

విజయవాడ మార్కెట్లలో బంగారం ధర మరోసారి దిగొచ్చింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.330 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,490కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,700కి క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. తాజాగా రూ.320 మేర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,840 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 వద్ద మార్కెట్ అవుతోంది. బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలు రూ.100 పెరిగి రూ.69,500కి చేరింది.

వెండి ధరల్లో రోజు రోజుకీ హెచ్చుతగ్గులున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న వెండి ధర నిన్న కొంతమేర తగ్గింది. నిన్న కేజీ వెండి ధర రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర కేజీ వెండి ధర రూ.73,800 ఉంది. అయితే బంగారం కంటే వెండి ధర రోజు రోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత పెరిగిన వెండి ధర.. మళ్ళీ దిగి రావడంలేదు..

Also Read: ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టం చేసిన బోర్డు .. ఆ రెండు పరీక్షలను విద్యార్థులు ఇంటినుంచి రాసే అవకాశం

మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి… తన క్రేజ్‌‌‌‌ను కంట్రీ దాటించిన రామ్ చరణ్