Happy Birthday Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి… తన క్రేజ్‌ను కంట్రీ దాటించిన రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.. అంతులేని అభిమానులు చరణ్ సొంతం..
Mar 27, 2021 | 8:41 AM
మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
చిరుత సినిమాతో హీరోగా అడుగు పెట్టిన చరణ్ సినిమా సినిమాకు పరిణితి చెందుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు.
రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు చరణ్..
నేడు (మార్చి 27)రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
మెగా అభిమానులంతా మెగాస్టార్ నుంచి మెగా... పవర్ స్టార్ నుంచి పవర్ తీసుకొని చరణ్ ను మెగా పవర్ స్టార్ ను చేసారు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో "హీ ఈజ్ కేరింగ్ సన్" 'హ్యాపీ బర్త్‌డే మై బాయ్.. గాడ్ బ్లెస్.. అమ్మ అండ్ డాడీ' అంటూ ఓ వీడియోతో విషెస్ తెలిపారు.
అటు సెలబ్రిటీలు కూడా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు.