చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘ఆచార్య’ టీమ్.. ఆకట్టుకుంటున్న మెగాపవర్ స్టార్ లుక్
Acharya Movie new poster : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు.
Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనుండటంతో మెగా అభిమానుల్లో ఆనందం డబుల్ అయ్యింది. చిరుని చరణ్ ను ఒకే స్క్రీన్ పైన చూడటానికి అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చరణ్ నటించిన మగధీర, బ్రూస్ లీ లో చిరు చిన్న గెస్ట్ రోల్లో కనిపించారు. ఇక చిరంజీవి నటించిన ఖైదీ నెం150లో చరణ్ ఒక పాటలో మెరిశాడు. ఇప్పడు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆచార్య సినిమా చరణ్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య నుంచి చరణ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చరణ్ తోపాటు చిరు కూడా ఉన్నారు. చిరు చరణ్ ఇద్దరు ఈ నక్సలైట్ గెటప్స్ లో చేతిలో తుపాకులతో ఎగ్రసివ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమానుంచి కూడా అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
రామ్ చరణ్ లుక్ ను షేర్ చేసిన మెగాస్టార్..
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Naga Chaitanya : నాగచైతన్య నెక్స్ట్ సినిమా ఆగిపోయిందా..? ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త