Naga Chaitanya : నాగచైతన్య నెక్స్ట్ సినిమా ఆగిపోయిందా..? ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ సాంగ్స్ , టీజర్ సినిమాపైనే అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి మనంలాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.
థాంక్యూ సినిమాలో చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా తర్వాత చైతన్య మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. థాంక్యూ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తోనూ ఓ సినిమా చేయనున్నాడట చైతన్య . తరుణ్ భాస్కర్ సినిమా పూర్తయిన తర్వాత ఇంద్రగంటి సినిమా తెరకెక్కబోతుందని టాక్. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ సుధీర్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబుతో కలిసి ఇప్పటివరకు ఇంద్రగంటి రెండు సినిమాలు చేసాడు. సమ్మోహనం, వి సినిమాల తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఇటు ఇంద్రగంటి అటు నాగచైతన్య తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. నాగార్జున కథానాయకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య నటించాల్సి ఉంది. దీనివల్ల కాల్షీట్ల పరంగా సమస్య తలెత్తిందట. దాంతో ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actress Pragathi: కూతురిని ఓ ఆటాడేసుకున్న ప్రగతి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..