Actress Pragathi: కూతురిని ఓ ఆటాడేసుకున్న ప్రగతి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియా యమా యాక్టివ్ ఉంటున్నారు. లాక్ డౌన్ తరువాత నుంచి ఫిట్ నెస్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ప్రగతి వరుస వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
Actress Pragathi: సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియా యమా యాక్టివ్ ఉంటున్నారు. లాక్ డౌన్ తరువాత నుంచి ఫిట్ నెస్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ప్రగతి వరుస వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. వర్కవుట్స్ వీడియోలు, డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకున్నారు. టాలీవుడ్ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న క్యారెక్టర్ యాక్టర్స్ లో ప్రగతి ఒకరు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పిస్తారు. అమ్మగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రగతి. ఇదిలా ఉంటే ఆ మధ్య ‘బొంబాయి’ సినిమాలోని ”హమ్మ.. హమ్మ” పాటకు డాన్స్ చేసి అందరు ఆశ్చర్య పోయేలా చేసింది. ఆ తరువాత దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అందరి చూపుని తనవైపు తిప్పుకుంది.
ఇటీవల బుల్లెట్ బైక్ నడుపుతోన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తాజాగా మరో వీడియోను షేర్ చేసారు ప్రగతి. కూతురిని ఆటపట్టిస్తూ ఓ వీడియాను వదిలింది ప్రగతి. ఈ వీడియోలో ప్రగతి తన కూతురిని సరదాగా ఆటపట్టించారు. సిల్క్ అనే పదాన్ని ఐదుసార్లు చెప్పని ప్రగతి అనగా తన కూతురు చెప్పింది అలాగే సిల్క్ స్పెల్లింగ్ అడగ్గా దానికి కూడా సమాధానం చెప్పింది. ఆతర్వాత ఆవు ఏం తాగుతుంది.? అని ప్రశ్నించగా ప్రగతి కూతురు మిల్క్ అంటూ పప్పులో కాలేసింది. దాంతో ప్రగతి ఒక్కసారిగా నవ్వేసింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు ఓ కుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Kurup Teaser : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న కురుప్ టీజర్
యంగ్ టైగర్ కోసం విలన్‌గా స్టార్ కమెడియన్.. మరోసారి ప్రతినాయకుడిగా అలరించనున్న సునీల్ !!
నవతరానికి యుద్ధ కళలు… సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..