AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యంగ్ టైగర్‏ కోసం విలన్‏గా స్టార్ కమెడియన్.. మరోసారి ప్రతినాయకుడిగా అలరించనున్న సునీల్ !!

Jr.NTR Trivikram Movie Update: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దర్శకదీరుడు రాజమౌళి తెరెకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో యంగ్

యంగ్ టైగర్‏ కోసం విలన్‏గా స్టార్ కమెడియన్.. మరోసారి ప్రతినాయకుడిగా అలరించనున్న సునీల్ !!
Jr.ntr Trivikram
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2021 | 9:57 PM

Share

Jr.NTR Trivikram Movie Update: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దర్శకదీరుడు రాజమౌళి తెరెకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో యంగ్ టైగర్‏తోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నాడట డైరెక్టర్.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‏డేట్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇందులో ఎన్టీఆర్‏కు ప్రతి నాయకుడిగా స్టార్ కమెడియన్ సునీల్ నటింబోతున్నట్లుగా సమాచారం. ఇన్ని సంవత్సరాలు తన సినిమాల్లో ఏదో ఒక పాత్రలో తన స్నేహితుడు సునీల్‏ ఉండేవాడు. ఇప్పటివరకు హీరోగా, కమెడియన్ పాత్రలు చేసిన సునీల్ మరోసారి విలన్‏గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో రాబోయే ఈ మూవీలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‏గా కనిపించనున్నాడట. ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం. గతంలో ఈ సినిమాలో ఎన్టీఆర్‎కు విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. పాన్ ఇండియన్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉండబోతుందని తెలుస్తుంది. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read:

నవతరానికి యుద్ధ కళలు… సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

AR Rehaman: యాంకర్ పై సంచలన కామెంట్లు చేసిన మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్..