AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Exams 2021: ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టం చేసిన బోర్డు .. ఆ రెండు పరీక్షలను విద్యార్థులు ఇంటినుంచి రాసే అవకాశం

కరోనా కల్లోలం అన్ని రంగాలతో పాటు విద్యా రంగంపై కూడా పడింది. గత ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నిన్నా మొన్నటి వరకూ ఆన్ లైన్ క్లాస్ ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించిన...

TS Inter Exams 2021: ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టం చేసిన బోర్డు .. ఆ రెండు పరీక్షలను విద్యార్థులు ఇంటినుంచి రాసే అవకాశం
Ts Inter Exams
Surya Kala
|

Updated on: Mar 27, 2021 | 8:59 AM

Share

TS Inter Exams 2021: కరోనా కల్లోలం అన్ని రంగాలతో పాటు విద్యా రంగంపై కూడా పడింది. గత ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నిన్నా మొన్నటి వరకూ ఆన్ లైన్ క్లాస్ ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించిన అధికారులు.. ఇటీవలే స్కూల్స్,కాలేజీలు తెరచారు. అయితే మళ్ళీ అక్కడ భారీగా కేసులు నమోదవుతూ.. ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణాలో విద్యాసంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులతో పాటు.. తల్లిదండ్రుల్లోనూ ఇంటర్ పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు స్పందించింది. పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే..

మే 1నుంచి ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు త్వరలో హాల్ టికెట్లు జారీ చేయనున్నామని .. చెప్పారు. ఇక ఏప్రిల్ 1, 3 వ తేదీల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్మెంట్ల రూపంలో నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం కాలేజీలు మూసి ఉన్నందున వీటిని ఇంటి నుంచే రాసె వెసులుబాటు కల్పించనున్నామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ తెలిపారు. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై సైతం జలీల్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి మూడు రకాల ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే అవి వాయిదా పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అంతేకాదు.. ఈసారి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేసే ఆలోచన ఏమీ లేదంటూ తేల్చి చెప్పారు. కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలను నిర్వహించడానికి అధికారులు రెడీ అవుతున్నారు.

Also Read: ఆ దేశంలో రోజుకో సమస్య.. ఎలుక, సాలీడులు స్వైర విహారం.. పనులు మాని మరీ పట్టుకోవడానికి బయలుదేరిన జనం