AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశంలో రోజుకో సమస్య.. ఎలుక, సాలీడులు స్వైర విహారం.. పనులు మాని మరీ పట్టుకోవడానికి బయలుదేరిన జనం

గోరు చుట్టు మీద రోకలి పోటు అన్న చందంగా మారిపోయింది ఆస్ట్రేలియా పరిస్థితి. ప్రపంచ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతుంది.. అయితే తాజాగా మరిన్ని సమస్యలు ఆస్ట్రేలియాను..

ఆ దేశంలో రోజుకో సమస్య.. ఎలుక, సాలీడులు స్వైర విహారం.. పనులు మాని మరీ పట్టుకోవడానికి బయలుదేరిన జనం
Eastern Australia
Surya Kala
|

Updated on: Mar 27, 2021 | 8:26 AM

Share

Mouse plagues in Australia: గోరు చుట్టు మీద రోకలి పోటు అన్న చందంగా మారిపోయింది ఆస్ట్రేలియా పరిస్థితి. ప్రపంచ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతుంది.. అయితే తాజాగా మరిన్ని సమస్యలు ఆస్ట్రేలియాను చుట్టుముట్టాయి. రోజుకో సవాల్ ను ఎదుర్కొంటుంది. తాజాగా ఆదేశం వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంది.. దీనికి తోడు ఇప్పుడు ఆ దేశానికి మరో సమస్య ఎలుకలు, సాలీడు రూపంలో వచ్చింది.

అవును తాజాగా ఆ దేశంలో ఒక్కసారిగా ఎలుక సంఖ్య పెరిగిపోయింది. దీంతో రెస్టారెంట్లు, షాప్స్ యజమానులు తమ బిజినెస్ ను క్లోజ్ చేసి మరీ ఎలుకలను పట్టుకునే పనిలో పడ్డారు., ఇక ఆస్ట్రేలియాలోని తూర్పు రాష్ట్రాలలో కొన్ని మిలియన్ల ఎలుకలు రోడ్డు మీద ఉల్లాసంగా కాట్ వాక్ చేస్తున్నాయి. దీంతో అక్కడ నివసించే వారు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు న్యూ సౌత్ వేల్స్‌లోని రైతులు తమ భూమిని, పంటను ధ్వసం చేస్తున్న ఎలుకలను, ఇళ్లలో నివాసం ఉంటున్న ఎలుకల వీడియో లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. న్యూ సౌత్ వేల్స్ ఆసుపత్రులలో కనీసం ముగ్గురు వ్యక్తులను ఎలుకలు కరిచాయి.

పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్ధాలను తినేస్తున్నాయి. మరికొన్ని వాహనాలను నాశనం చేస్తున్నాయట.. దీంతో అధికారులతో పాటు.. ప్రజలు కూడా తమ పనులను పక్కన పెట్టి.. ఎలుకలను పట్టుకునే పనిలో పడ్డారు. అధికారులు ఏమో.. ఎలుకల వల్ల ప్లేగు వ్యాపిస్తుందేమో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సిడ్నీ వంటి ప్రాంతాల్లో ఎలుకలతో పాటు .. ప్రమాదకరమైన అరక్నిడ్ (ఫన్నెల్ వెబ్) సాలీళ్లు కూడా ఇళ్లల్లో సందడి చేస్తున్నాయి.. వీటిని నుంచి రక్షించుకోవడానికి సిడ్నీ వాసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి కరిస్తే.. మరణించినవారు కూడా ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ ఈ సాలీడులను పట్టి తమకు అందించాలని కోరుతుంది. వాటి నుంచి యాంటీ వీనమ్ తయారుచేస్తామని చెబుతుంది.

Also Read: డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు.. వివరాల్లోకి వెళ్తే..!

అప్పుడు , ఇప్పుడు, ఎల్లప్పుడూ హి ఈజ్ కేరింగ్ సన్ అంటూ తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు