Karthika Deepam: వంటలక్కకు షాక్ ఇస్తున్న ప్రేక్షకులు.. రోజు రోజుకీ తగ్గుతున్న టీఆర్పీ రేటింగ్.. రేసులోకి వచ్చిన కొత్త సీరియల్
Karthika Deepam: ఆదరిస్తున్నారు కదా అని.. ఇష్టారీతిలో సాగదీస్తూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడితే ఎలా ఉంటుంది అంటే.. కార్తీక దీపం సీరియల్ లా ఉంటుంది అంటూ..
Karthika Deepam: ఆదరిస్తున్నారు కదా అని.. ఇష్టారీతిలో సాగదీస్తూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడితే ఎలా ఉంటుంది అంటే.. కార్తీక దీపం సీరియల్ లా ఉంటుంది అంటూ బుల్లి తెర ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ లో సీరియల్స్ ముఖ్య పాత్రను పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదిలో 39వ వారానికి సంబంధించిన రేటింగ్ రిలీజ్ అయ్యింది. దీంతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న కార్తీక దీపం సీరియల్ రేటింగ్ క్రమేపి తగ్గుతుండగా.. అనూహ్యంగా గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకీ ఆదరణ పెంచుకుంటుంది. ఈ వారం ఈ సీరియల్ ఎంత రేటింగ్ ను సొంతం చేసుకున్నాయంటే..
కార్తీక దీపం సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు ఇలా ప్రతి పాత్రకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొన్ని వారాలుగా సాగదీతపై విమర్శలు వినిపిస్తున్నాయి. అది కూడా కథ, కథనంలో బలం లేకుండా సాగదీస్తున్నారంటూ చేస్తున్న విమర్శలకు బలం చేకూరేలా టెలివిజన్ రేటింగ్ రోజు రోజుకీ పడిపోతుంది. గత వారంలో అర్బన్ ప్రాంతంలో 16.31 రేటింగ్ ను , రూరల్ లో 16.66 రేటింగ్ తో ఉన్న కార్తీక దీపం ఈ వారం (39వవారం) అర్బన్ ప్రాంతంలో 14.95 రేటింగ్, రూరల్ లో 16.08 రేటింగ్ ను సొంతం చేసుకుంది. క్రమేపీ కార్తీక దీపం తన ఆదరణ కోల్పోతుంది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ టెన్ సీరియల్ లో ఇప్పటికీ కార్తీక దీపం మొదటి ప్లేస్ లోనే కొనసాగుతుంది.
మరోవైపు గుప్పెడంత మనసు అనూహ్యంగా భారీ రేటింగ్ ను సొంతం చేసుకుంది 39 వ వారంలో ఏకంగా ఐదో ప్లేస్ నుంచి రెండో స్థానానికి చేరుకుంది. మంచి కంటెంట్ ఉండటంతో వారం వారం తన రేటింగ్‌ను మెరుగుపరుచుకొంటూ కార్తీక దీపం సీరియల్ రేటింగ్ దగ్గరకు చేరుకుంటుంది. ఇక జానకి కలగనలేదు, ఇంటింటి గృహలక్ష్మీ, వదినమ్మ, దేవత, రాధమ్మ కూతురు, నంబర్ 1 కోడలు , కృష్ణ తులసి, ప్రేమ ఎంత మధురం , త్రినయని సీరియల్స్ కూడా తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. రోజు రోజుకీ తమ రేటింగ్ ను మెరుగుపరచుకుంటూ టాప్ టెన్ సీరియల్స్ లో ఒకటిగా దూసుకుపోతున్నాయి.
Also Read: ప్రకాష్ రాజ్‌కి క్రమశిక్షణ లేదంటూ విష్ణుకి మద్దతు ప్రకటించిన కోటా శ్రీనివాసరావు..