AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీను వార్నింగ్.. నీ గురించి నాకు తెలుసు..

బిగ్ బాస్ సీజన్ 9లో ఫైర్ బ్రాండ్ గా అడుగుపెట్టింది దివ్వెల మాధురి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వెంటనే ఇంట్లో బంధాలు, బాండింగ్స్ పై ఇచ్చిపడేసింది. ఆ తర్వాత మాట తీరు మార్చుకోవాలని హోస్ట్ నాగార్జున చెప్పడంతో ఇప్పుడు తన ఆట తీరు కూడా మార్చుకుంది. తనూజతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ తన గేమ్ పై ఫోకస్ పెట్టింది.

Bigg Boss 9 Telugu : దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీను వార్నింగ్.. నీ గురించి నాకు తెలుసు..
Duvvada Srinivas
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2025 | 9:31 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. ఇప్పుడు ఆట రణరంగంగా మారింది. ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి దమ్ము శ్రీజ, భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరికి పెట్టిన టాస్కులలో భరణికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇదంతా పక్కనపెడితే.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ లో ఫైర్ బ్రాండ్ లా అడుగుపెట్టింది దివ్వెల మాధురి. ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే దమ్ము శ్రీజతో ఓ రేంజ్ లో గొడవ పెట్టుకుంది. పేరు తెలియదు అని చెప్పినందుకు నా పేరు తెలియదా అంటూ నానా హంగామా చేసింది. ఇక ఇటీవల నామినేషన్స్ కోసం రీఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ.. మాధురికి తన స్టైల్లో కౌంటరిచ్చింది. దువ్వాడ మాధురి ఎవరో నీకు తెలియకపోతే.. బయటకు వెళ్లి అడుగు అని అన్నారు.. వెళ్లి అడిగాను.. మాధురి అంటే ఎవరో తెలియదు అంటున్నారు. నాకే కాదు.. బయటచాలామందికి తెలియదు. అంటూ పంచ్ ఇచ్చింది. ఇక ఈ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఆ అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా.. ఆమెను మాధురి ఎలిమినేట్ చేయలేదు. హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్ంట్స్ ఆమెను ఎలిమినేట్ చేశారు. మాధురి ఎవరో తెలియదు అని చెప్పినందుకు ఆమెను బయటకు పంపించలేదు. చిన్న పిల్లలను మాధురి అంతగా పట్టించుకోదు. శ్రీజది వైజాగ్. ఆమె ఇంటి డోర్ నంబర్ తో సహా నాకు తెలుసు.. వాళ్ల నాన్న కూడా నాకు తెలుసు. వాళ్ల గురించి మొత్తం నాకు తెలుసు.. తెలియకపోతే అడిగే పద్దతి ఉంటుంది. మీరు నాకు పరిచయం లేదు. మీ గురించి పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడగాలి. మాధురి రాగానే అక్కడున్నవాళ్లంతా పవర్ బ్యాంక్ వచ్చిందని అన్నారు.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

మాధురిని చూడగానే కొంతమందికి చెమటలు పట్టేశాయి. ఎలా మాట్లాడాలి.. ? ఎలా తట్టుకోవాలి ? అని అందరు హడలిపోతుంటే.. ఈమెకు మాత్రం పేరు తెలియదా.. ? అందరూ పలకరిస్తుంటే ఈమెకు పేరు అడగాలి అనిపించిందా.. ? మాధురిని నువ్వు ఎవరు అని అడిగితే క్రేజ్ పెరుగుతుంది. గుర్తింపు వస్తుందనే మాధురిని పేరు అడిగింది తప్పితే మనస్పూర్తిగా కాదు..శ్రీజ చాలా అహంకారంతో అడిగింది. అందుకే మాధురి నుంచి ఆన్సర్ అలా వచ్చింది. మాధురి బిగ్ బాస్ కు వెళ్లాలని అనుకోలేదు. అటు నుంచి ఒత్తిడి వచ్చింది. అందుకే వెళ్లింది. తన మార్క్ చూపిస్తుంది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..