‘లవ్‌స్టోరీ’ తర్వాత థ్రిల్లర్ సినిమా చేయనున్న శేఖర్ కమ్ముల!

లవ్ స్టోరీస్‌ని సున్నితంగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. ఇప్పటివరకూ శేఖర్ కమ్ముల ఎక్కువగా ఫ్రెండ్ షిప్, లవ్, కుటుంబ నేపథ్య కథలతో సినిమాలు తీశారు. గతంలో ఓ సారి పంథా మార్చి నయనతారతో 'అనామిక' అనే థ్రిల్లర్‌ సినిమాను..

'లవ్‌స్టోరీ' తర్వాత థ్రిల్లర్ సినిమా చేయనున్న శేఖర్ కమ్ముల!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 9:55 AM

లవ్ స్టోరీస్‌ని సున్నితంగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. ఇప్పటివరకూ శేఖర్ కమ్ముల ఎక్కువగా ఫ్రెండ్ షిప్, లవ్, కుటుంబ నేపథ్య కథలతో సినిమాలు తీశారు. గతంలో ఓ సారి పంథా మార్చి నయనతారతో ‘అనామిక’ అనే థ్రిల్లర్‌ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ ‘కహానీ’కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రం మిశ్రమ ఫలితాల్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు అదే జోనర్‌లో తన తర్వాతి ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట శేఖర్.

కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్‌ స్టోరీ’ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా, లాక్‌డౌన్ వల్ల అది నిలిచిపోయింది. దీంతో విరామ సమయంలోనే తదుపరి చిత్రానికి కథ సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ సారి ప్రేమ, ఫ్రెండ్ షిప్ కథలతో కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ తీయాలని భావిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు అనామిక‌కి సీక్వెల్‌నా? లేక మరో మరేదైనా జోనరా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More: 

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్