AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుకు మరో షాక్.. ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న కాజల్..?

చిరంజీవికి మరో షాక్‌ తగిలిందా..? ఆచార్య నుంచి కాజల్ తప్పుకుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌లో. కాగా ఈ సినిమా కోసం మొదట త్రిషను హీరోయిన్‌గా ప్రకటించారు.

చిరుకు మరో షాక్.. 'ఆచార్య' నుంచి తప్పుకున్న కాజల్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2020 | 8:04 PM

Share

చిరంజీవికి మరో షాక్‌ తగిలిందా..? ఆచార్య నుంచి కాజల్ తప్పుకుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌లో. కాగా ఈ సినిమా కోసం మొదట త్రిషను హీరోయిన్‌గా ప్రకటించారు. అయితే క్రియేటివ్‌ ఢిపరెన్స్‌ల వలన ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఆ తరువాత కాజల్‌ అగర్వాల్‌ లైన్‌లోకి వచ్చింది. చిరంజీవితో రెండోసారి తాను జత కట్టబోతున్నట్లు అధికారికంగా చందమామ కూడా ప్రకటించేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి సినిమాకు ఓకే చెప్పకముందు తమిళ్‌లో ఓ సినిమాకు సంతకం చేసిందట కాజల్. దానికి అడ్వాన్స్‌ కూడా తీసుకుందట. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఇక లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత మూవీల చిత్రీకరణ ప్రారంభం అయితే.. అన్నింటికి డేట్లు అడ్జెస్ట్ చేయడం కాజల్‌కు కష్టంగా మారనుందట. దీంతో చిరుకు సారీ చెప్పినట్లు టాక్‌ నడుస్తోంది. ఇక కాజల్ ఇచ్చిన షాక్‌తో టీమ్‌ మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మెగాస్టార్ మూవీ నుంచి కాజల్ తప్పుకుందా..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్, అజయ్‌, సోనూసూద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనుండగా.. రెజీనా ప్రత్యేక గీతం మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: Breaking: భారత ఫుట్‌బాల్ లెజండ్ గోస్వామి కన్నుమూత..!

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్