మహేష్ నిర్మాణంలో చెర్రీ..!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ స్నేహం కారణంగానే రామ్ చరణ్‌తో మహేష్‌ బాబు మూవీని నిర్మించబోతున్నాడని వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ నిర్మాణంలో చెర్రీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 4:37 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ స్నేహం కారణంగానే రామ్ చరణ్‌తో మహేష్‌ బాబు మూవీని నిర్మించబోతున్నాడని వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫిలింనగర్ వర్గాల ప్రకారం.. వంశీ పైడిపల్లితో మరో సినిమాలో నటించేందుకు మహేష్ ఆ మధ్యన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఆ మూవీ కథను రామ్ చరణ్‌కు వినిపించారట వంశీ. కథను విన్న చెర్రీ బావుందని చెప్పారట.

ఈ విషయం తెలిసిన మహేష్‌.. ఈ సినిమాలో తాను నటించకపోయినప్పటికీ నిర్మిస్తానని మాట ఇచ్చారట. దీంతో వంశీ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వంశీ పైడపల్లి మహేష్‌తో సినిమా కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన తరువాత అన్ని వివరాలు చెబుతానని ఆయన అన్నారు. ఇలాంటి నేపథ్యంలో వంశీ- చెర్రీ సినిమా వట్టి పుకారేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ వేళ పోలీసుల అత్యుత్సాహం.. బ్రిడ్జిపై అవస్థలు పడుతున్న రోగులు

Latest Articles