పవన్‌-నాని-చైతన్య కాంబోలో చిత్రం.. దర్శకుడు ఎవరంటే..!

పవన్‌-నాని-చైతన్య కాంబోలో చిత్రం.. దర్శకుడు ఎవరంటే..!

పవన్‌ కల్యాణ్- నాని- నాగ చైతన్య.. ఈ కాంబోలో సినిమా రాబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌లో.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 01, 2020 | 5:19 PM

పవన్‌ కల్యాణ్- నాని- నాగ చైతన్య.. ఈ కాంబోలో సినిమా రాబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌లో. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించకపోయినప్పటికీ.. ఈ కాంబోలో మూవీ ఖరారైందని తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల ప్రకారం.. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సంతోషం’ సినిమాల దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పారట. ఇక ఈ మూవీని నాని తన బ్యానర్‌లో నిర్మించబోతున్నారట. అలాగే పీకే క్రియేటివ్‌ వర్క్స్ బ్యానర్ కింద ఈ సినిమాను పవన్‌ కల్యాణ్ సమర్పించబోతున్నట్లు టాక్. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ భాగం కానుందని.. కానీ త్రివిక్రమ్ పేరు ఉండబోతుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగులో క్రేజీ కాంబోలో మూవీ రానుంది.

కాగా ప్రస్తుతం నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీలో నటిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సాయి పల్లవి రొమాన్స్ చేస్తోంది. రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ‘బిగ్‌బాస్ 4’ కంటెస్టెంట్‌ల లిస్ట్‌ లీక్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu