‘తలా’ క్రేజ్ అమోఘం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డు బ్రేక్..

సాధారణంగా సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల అభిమానులు వార్ చేసుకుంటుంటారు. విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇది సర్వ సాధారణం. తన హీరో గొప్ప అంటే.. తన హీరో గొప్ప అని సోషల్ మీడియాలో గొడవపడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా తలా ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్‌లో క్రియేట్ చేసిన ఓ రికార్డును బద్దలుకొట్టారు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. అందులో భాగంగానే ఆయన అభిమానులు ట్విట్టర్‌లో ఓ రికార్డు సృష్టించారు. ఆయనకు […]

  • Ravi Kiran
  • Publish Date - 3:55 pm, Fri, 1 May 20
'తలా' క్రేజ్ అమోఘం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డు బ్రేక్..

సాధారణంగా సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల అభిమానులు వార్ చేసుకుంటుంటారు. విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇది సర్వ సాధారణం. తన హీరో గొప్ప అంటే.. తన హీరో గొప్ప అని సోషల్ మీడియాలో గొడవపడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా తలా ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్‌లో క్రియేట్ చేసిన ఓ రికార్డును బద్దలుకొట్టారు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. అందులో భాగంగానే ఆయన అభిమానులు ట్విట్టర్‌లో ఓ రికార్డు సృష్టించారు.

ఆయనకు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెబుతూ #SultanNTRBdayMonthCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ సెట్ చేశారు. ఇక ఈ రికార్డును అజిత్ ఫ్యాన్స్ బ్రేక్ చేశారు. ఇవాళ తలా అజిత్ కుమార్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తన అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ #ThalaAjithBdayGalaCDP హ్యాష్ ట్యాగ్‌తో సుమారు 4.6 మిలియన్ ట్వీట్లు చేశారు. మరోవైపు కేరళలోని అజిత్ అభిమానులు తమ హీరో కామన్ పిక్చర్‌ను ఏకంగా 28 మలయాళం స్టార్లతో లాంచ్ చేశారు.

ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన హీరోల ట్యాగ్స్…

  • #ThalaAjithBdayGalaCDP – 4.6M
  • #SultanNTRBdayMonthCDP- 2.7M- (Advance Birthday CDP)
  • #PawanKalyanBirthdayCDP-2.2M
  • #SuperstarMaheshBdayCDP – 2M
  • #BaadshahSudeepBDayCDP -1.5M
  • #BossBdayCDP – 1.4M
  • #SuriyaBirthdayCDP – 1.1M

కాగా, ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 కావడంతో.. ఆయన ఫ్యాన్స్.. తలా అభిమానులు క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read This: గుడ్ న్యూస్.. 10 లక్షల మంది కరోనాను జయించారు..