గుడ్ న్యూస్.. 10 లక్షల మంది కరోనాను జయించారు..

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,320,541 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,049,259 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20,31,398గా ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 234,392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 35 వేలు మార్క్ దాటగా.. 8889 మంది ఆసుపత్రుల […]

గుడ్ న్యూస్.. 10 లక్షల మంది కరోనాను జయించారు..
World Coronavirus
Follow us

|

Updated on: May 01, 2020 | 3:49 PM

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,320,541 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,049,259 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20,31,398గా ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 234,392 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 35 వేలు మార్క్ దాటగా.. 8889 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 1147కు చేరింది. కాగా, మహారాష్ట్రలో మాత్రం కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Read This: హిందూ దేవాలయాల వద్ద డ్యూటీ చేసుకోండి.. మజ్లిస్ కార్పొరేటర్ హాల్‌చల్‌..