AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: ఏసీలు వద్దు…ఫ్యాన్లు ముద్దు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఢిల్లీ హైకోర్టులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు జడ్జీలతో కూడిన కమిటీ కార్యాచరణ ప్రణాళికను

కరోనా ఎఫెక్ట్: ఏసీలు వద్దు...ఫ్యాన్లు ముద్దు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 3:57 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఢిల్లీ హైకోర్టులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు జడ్జీలతో కూడిన కమిటీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కోర్టులో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనర్ల స్థానంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని జడ్జీలు నిర్ణయించారు. సెంట్రల్ ఏసీ యూనిట్లు కరోనా వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉన్నందున కోర్టుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని జడ్జీలు పీడబ్ల్యూడీ ఇంజినీర్లకు సూచించింది.

కాగా.. లాక్ డౌన్ ఎత్తివేశాక ఢిల్లీ హైకోర్టు పునర్ ప్రారంభిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై జడ్జీలు చర్చించారు. ఒకవేళ సెంట్రల్ ఏసీ వాడితే అందులో వైరస్ ను నివారించేందుకు వీలుగా అల్ట్రా వయోలెట్ జెర్మిసైడ్ ఎరాడికేషన్ డివైజ్ వాడితే ఎలా ఉంటుందనే విషయంపై జడ్జీలు చర్చించారు. ఈ పధ్ధతి ఖర్చుతో కూడకున్నదని, ఇది పూర్తిగా వైరస్ ను అరికడుతుందా లేదా అనేది చూడాల్సి ఉందని జడ్జీలు వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఎయిర్ కండీషనర్ల వినియోగం నిలిపివేయాలని, దాని స్థానంలో కోర్టులోని అన్ని బ్లాకుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరింది. హైకోర్టు భవనంలో కిటికీల నుంచి దోమలు లోపలకు ప్రవేశించకుండా మెష్ అమర్చాలని పీడబ్ల్యూడీ ఇంజినీర్లు ప్రతిపాదించారు. హైకోర్టులో అత్యవసర కేసుల విచారణ సందర్భంగా వీడియో కాన్సరెన్స్ లో న్యాయవాదులు డ్రెస్ కోడ్ తప్ప కోట్స్, బ్యాండ్స్, టైలు ధరించనక్కరలేదని కమిటీ ప్రకటించింది.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..