ఆ సినిమాలో కీరవాణి పోలీసుగా నటించాల్సింది కానీ!

ఆ సినిమాలో కీరవాణి పోలీసుగా నటించాల్సింది కానీ!

తెరవెనుక ఉండే డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అప్పుడప్పుడు తెరపై కనిపిస్తూంటారు. కనీసం నిమిషం పాటైనా తళుక్కుమని మెరుస్తూంటారు. ఇలానే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఓ సినిమాలో పోలీసుగా నటించే..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 01, 2020 | 5:04 PM

తెరవెనుక ఉండే డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అప్పుడప్పుడు తెరపై కనిపిస్తూంటారు. కనీసం నిమిషం పాటైనా తళుక్కుమని మెరుస్తూంటారు. ఇలానే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఓ సినిమాలో పోలీసుగా నటించే అవకాశమొచ్చింది. అయితే సమయం కుదరక అందులో నటించలేకపోయారు. నిజానికి కీరవాణి సతీమణికి పోలీసులంటే చాల ఇష్టం. అనుకోకుండా సంగీత దర్శకుడ్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె కోరిక నెరవేర్చేందుకు ఓ రోజు ఐపీఎస్ ఆఫీసర్‌గా వేషం వేసుకుని.. ఫొటో తీసుకున్నారు. దానిని డైరెక్టర్ రాఘవేంద్ర రావుకు చూపించి ఏదైనా పోలీసు వేషం ఉంటే ఇవ్వమని కీరవాణి సరదాగా అడిగారట.

ఈ క్రమంలో రాఘవేంద్ర రావు ‘ఘరానా బుల్లోడు’ సినిమాలో ఇన్ స్పెక్టర్ పాత్రలో కీరవాణిని నటించమన్నారు. అయితే ఆ సమయంలో రికార్డింగ్‌లో బీజీగా ఉండటం వల్ల ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కీరవాణి. అయితే ఈ చిత్రానికి సంగీతం అందించింది కీరవాణినే కావడం విశేషం. ఈ సినిమాలో నాగార్జున హీరోగా, రమ్య కృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించారు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu